కువైట్లో రోడ్డు ప్రమాదం.. ఏడుగురు ప్రవాసులు మృతి..మృతుల్లో భారతీయులు
- July 10, 2024
కువైట్: మంగళవారం తెల్లవారుజామున ఏడవ రింగ్ రోడ్డులో జరిగిన ఘోర ప్రమాదంలో ఐదుగురు భారతీయులు, ఇద్దరు బంగ్లాదేశీయులు సహా ఏడుగురు ప్రవాసులు మరణించారు. అధికారుల కథనం ప్రకారం.. వారు తమ పని స్థలం నుండి మినీ వ్యాన్‌లో తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. వారు ప్రయాణిస్తున్న వ్యాన్‌ను మరొక వాహనం ఢీకొనడంతో వ్యాన్ నియంత్రణ కోల్పోయి అబ్దుల్లా అల్ ముబారక్ ప్రాంతానికి ఎదురుగా ఉన్న ఏడవ రింగ్ రోడ్డులో వంతెన డివైడర్‌ను ఢీకొట్టింది. దుర్ఘటనలో మరణించిన భారతీయులను బిహారీ లాల్, బక్కర్ సింగ్, బిక్రమ్ సింగ్, దేవేందర్ సింగ్ మరియు రాజ్ కుమార్ కృష్ణస్వామిగా గుర్తించారు. సురేంద్రన్, బిను మనోహరన్, గురుచరణ్ సింగ్ సహా ముగ్గురు భారతీయులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
తాజా వార్తలు
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన
- గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్ ప్రతిపాదనపై సీఎం రేవంత్
- బహ్రెయిన్, యూఏఈ పై ఇరాన్ కామెంట్స్..జీసీసీ సీరియస్..!!
- ఖతార్ లో నేషనల్ వాలంటీర్ వర్క్ ల్యాబ్ ప్రారంభం..!!
- 36, 610 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!







