ఏపీలో రూ.60 వేల కోట్ల బీపీసీయల్ పెట్టుబడి: ఎంపీ బాలశౌరి

- July 10, 2024 , by Maagulf
ఏపీలో రూ.60 వేల కోట్ల బీపీసీయల్ పెట్టుబడి: ఎంపీ బాలశౌరి

విజయవాడ: తెలంగాణా, ఏపీ విభజన తర్వాత ఏపీ పునర్విభజన చట్టంలో ఒక రిఫైనరీ ఇవ్వాలని ఉందని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి అన్నారు. ఇటీవల ఢిల్లీ వచ్చిన చంద్రబాబు.. ఈ అంశాన్ని కేంద్ర పెద్దలను కలిసి విన్నవించారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి ఆయిల్ రిఫైనరీ ఏపీకి ఇచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.

బీపీసీయల్ సీఎండీ, ఇతర బోర్డు సభ్యులు ఏపీకి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారని తెలిపారు. ముందుగా అందరం దుర్గమ్మను దర్శించుకున్నామన్నారు. భగవంతుడి దయ వల్ల 60వేల కోట్ల ప్రాజెక్టు ఏపీకి వస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా 25వేల మందికి ఉపాధి దొరుకుతుందని వెల్లడించారు. సీఎం, డిప్యూటీ సీఎం సూచనలతో ఎంపీలంతా ఈ ప్రాజెక్టు త్వరతిగతిన తీసుకువచ్చేందుకు తమ వంతు కృషి చేస్తామని ఎంపీ బాలశౌరి స్పష్టం చేశారు.

ఇంద్రకీలాద్రి పై కొలువుదీరిన కనక దుర్గమ్మను మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, బీపీసీఎల్ సీఎండీ కృష్ణ కుమార్ , పీబీసీఎల్ ఫైనాన్స్ డైరెక్టర్ గుప్తా బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేదమంత్రోచరణలు, మంగళవాయిధ్యాలతో ఆలయ ఈవో స్వాగతం పలికారు. అధికారులు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com