రవికుమార్ దర్శకత్వంలో రానున్న 'త్యాగాల వీణ' సినిమా
- June 14, 2016
'ఎంతో మంది ప్రాణ త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ ఉద్యమం పవిత్రమైనది. అలాంటి తెలంగాణ ఉద్యమాన్ని సినిమాగా రూపొందించడం అభినందనీయం' అని స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. సుమన్, శివకృష్ణ, ప్రీతినిగమ్, మధుబాల ప్రధాన పాత్రధారులుగా మిరియాల రవి కుమార్ దర్శకత్వంలో ప్రేమా మూవీస్ పతాకంపై కొత్తపల్లి సతీష్‌బాబు నిర్మిస్తున్న చిత్రం 'త్యాగాల వీణ'. ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. అతిథిగా విచ్చేసిన స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ, 'తెలంగాణ ఉద్యమం ఎంతో స్ఫూర్తివంతమైనది. తెలంగాణ కోసం కేసీఆర్ కూడా ప్రాణత్యాగానికి సిద్ధమయ్యారు. తెలంగాణ సాధన గొప్ప పరిణామం.
ఇప్పుడు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరే సమయం ఆసన్నమైంది. ఇలాంటి టైమ్‌లో తెలంగాణ ఉద్యమాన్ని ప్రతిబింబించేలా ఈ సినిమాను రూపొందించడం మంచి పరిణామం. మున్ముందు మరిన్ని సినిమాలు రావాలి. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలి' అని అన్నారు. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ, 'తెలంగాణ సమస్తం త్యాగాలతో కూడుకుని ఉంది. అనేక మంది త్యాగల ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. ఈ తెలంగాణ ఉద్యమ చరిత్రను కొత్త తరానికి సినిమా మాద్యమం ద్వారా చెప్పడం అభినందనీయం' అని అన్నారు. 'ఒక రాష్ట్రం కోసం ఇన్ని ఆత్మ బలిదానాలు జరగడం దేశంలో ఎక్కడా జరగలేదు. అన్ని వర్గాల ప్రజలు ఏకమై సాధించుకున్న తెలంగాణ చరిత్రను, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఈ చిత్రాన్ని రూపొందించాం. ఈ చిత్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అంకితమిస్తున్నాను' అని దర్శకుడు చెప్పారు. 'ఈ సినిమాకు ఈటల రాజేందర్ ద్వారా ప్రభుత్వంతో మాట్లాడి రాయితీ ఇప్పించడానికి ప్రయత్నిస్తాను' అని టీఆర్‌ఎస్ నాయకుడు శంకర్ రెడ్డి తెలిపారు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







