సినిమా రివ్యూ: ‘భారతీయుడు 2’
- July 12, 202428 ఏళ్ల క్రితం వచ్చిన ‘భారతీయుడు’ సినిమా అప్పట్లో ఓ సంచలనం. ఆ సంచలనాత్మక చిత్రం చూసిన వారెవ్వరూ ఆ ఫీలింగ్‌ని ఇప్పటికీ మర్చిపోలేరు. ఇన్నాళ్ల తర్వాత వచ్చిన ‘భారతీయుడు 2’ చిత్రం ఆ స్థాయిలో ప్రేక్షకులకు కిక్ ఇచ్చిందా.? అసలు అంచనాల్ని అందుకుందా.? లేదా.? తెలియాలంటే కథలోకి వెళ్లా్సిందే.
కథ:
అరవింద్ (సిద్దార్ధ్) అతని స్నేహితురాలు ప్రియా భవానీ శంకర్ మరో ఇద్దరు కలిసి సమాజంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడుతుంటారు. సోషల్ మీడియా వేదికగా తమదైన అభిప్రాయాల్ని తెలియజేసే వీడియోలు చేస్తూ ప్రజల్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు అధికారులు, రాజకీయ నేతల కారణంగా అరవింద్ అండ్ టీమ్ చిక్కుల్లో పడుతుంది. పోలీసులు అరెస్టు చేస్తారు. ఈ అన్యాయాలు ఆగాలంటే మళ్లీ సేనాపతి రావాలంటూ ఆయన పేరును ట్రెండింగ్ చేస్తారు. ఎక్కడో విదేశాల్లో వున్న సేనాపతిని ఈ వార్త చేరడంతో ఇండియాకి తిరిగొస్తాడు. అన్యాయాలు, అక్రమాలు చేస్తున్న అధికారుల్ని, రాజకీయ నేతల్ని తనదైన ఫక్కీలో చంపేస్తుంటాడు. ఈ కోణంలోనే సిద్దార్ధ్ తల్లి చనిపోతుంది. అందుకు కారణం భారతీయుడి ప్రభావవంతమైన మాటలే.. అంటూ ప్రజలు భారతీయుడికి ఎదురు తిరుగుతారు. కోపం పెంచుకుంటారు. అసలు సిద్దార్ధ్ తల్లి మరణానికి కారణమయ్యేలా ‘భారతీయుడు’ ఏం చేశాడు.? రకుల్ ప్రీత్ సింగ్‌కీ సిద్దార్ధ్‌కీ సంబంధం ఏంటీ.? చిక్కుల్లో పడిన ఇన్‌ఫ్లూయర్స్ టీమ్ (సిద్దార్ధ్ అండ్ కో)ని భారతీయుడు కలిశాడా.? ఎలాగైనా సేనాపతిని పట్టుకోవాలని తిరుగుతున్న సీబీఐ ఆఫీసర్ (బాబీ సింహా) పట్టుకోగలిగా.? చివరికి భారతీయుడు ఏమయ్యాడు.? వచ్చిన పని నెరవేర్చగలిగాడా.? ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరకాలంటే ‘భారతీయుడు 2’ ధియేటర్లలో చూడాల్సిందే.
నటీ నటుల పనితీరు:
ఈ సినిమాలో ప్రధమంగా చెప్పుకోవల్సిన పాత్ర సిద్దార్ధ్. ఫస్ట్ హాఫ్ నుంచీ ఎక్కువ నిడివితో వున్న పాత్ర సిద్దార్ధ్‌దే. తనకున్న పరిధిలో తన పాత్రకు న్యాయం చేశాడు. తల్లి మరణించినా తలకొరివి పెట్టడానికి వెళ్లలేకపోయిన సీన్‌లో తనదైన ఎమోషన్‌తో కట్టి పడేశాడు. సమాజంలోని అవినీతిని ఎదుర్కొనే కుర్రోడిలా, యువతలో చైతన్యం తీసుకొచ్చేందుకు చేసే ప్రయత్నం.. ఆయా సన్నివేశాల్లో సిద్దార్ధ్ తన వంతు బెస్ట్ పర్‌ఫామెన్స్ ఇచ్చాడనే చెప్పొచ్చు. రకుల్ ప్రీత్ సింగ్ పాత్ర కూడా ఒకింత ఇదే తరహాలో వున్నప్పటికీ అంతగా ఆకట్టుకోలేదెందుకో. మరో హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ పాత్ర ఒకింత ఫర్వాలేదనిపిస్తుంది రకుల్‌తో పోల్చితే. సీబీఐ ఆఫీసర్‌గా బాబీ సింహా ఆకట్టుకుంటాడు. చిన్న రోలే అయినా సముద్ర ఖని పాత్ర కూడా బాగుంటుంది. సకల కళా వల్లభన్ సద్గుణ పాత్రలో ఎస్.జె సూర్య పాత్ర చాలా బాగుంటుంది. ఇక ముఖ్యంగా చెప్పుకోదగ్గ పాత్ర టైటిల్ రోల్ సేనాపతి కమల్ హాసన్. నిజానికి కమల్ పర్‌ఫామెన్స్ గురించి చెప్పడానికేముంది. ఎన్నో సినిమాల అనుభవముంది ఆయనకు. ఆ అనుభవాన్నంతా రంగరించి నటించేశారు. అయితే, కనిపించిన దాంట్లో ఎక్కువ సేపు ఓవర్ మేకప్‌లోనే కనిపిస్తారు. దాంతో, కమల్‌ని గుర్తు పట్టడం కాస్త కష్టమే అయ్యింది ఆడియన్స్‌కి. నేచురాలిటీకి దూరమైపోయింది కమల్ హాసన్ పాత్ర. అయినా కానీ తనదైన స్టైలింగ్, మ్యానరిజమ్స్‌తో కట్టి పడేస్తాడు. మిగిలిన పాత్రలు పరిధి మేర ఆకట్టుకుంటాయ్.
సాంకేతిక వర్గం పనితీరు:
ఇలాంటి సినిమాలకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం. కానీ, అనిరుధ్ ఆ తరహా మ్యాజిక్ ఈ సినిమాకి క్రియేట్ చేయలేకపోయాడనిపిస్తుంది. పాటలు అంతగా ఆకట్టుకోలేదు. కొన్ని సీన్లలో మొదటి పార్ట్ భారతీయుడు బీజీఎమ్‌ని మ్యాచ్ చేస్తాడు. అక్కడ మాత్రం అనిరుధ్ సంగీతం ఆకట్టుకుంటుంది. ఓవరాల్‌గా చూస్తూ ఫెయిలైందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. రవి వర్మన్ సినిమాటోగ్రఫీ ఆధ్యంతం ఆకట్టుకుంటుంది. సెకండాఫ్‌లో అయితే మరింత ఎఫెక్టివ్‌గా అనిపిస్తుంది. ఎ. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ ఫస్టాఫ్‌లో చాలా బోర్ కొట్టిస్తుంది. సెకండాఫ్‌లో సేనాపతి క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చాకా వేగం పుంజుకుంటుంది. లైకా ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలు ఓకే. ఓవరాల్‌గా శంకర్ సినిమా అంటేనే టెక్నీషియన్లకు పండగ. ఒక్కరు కాదు, ఒక్కో విభాగంలోనూ ఒకరికి పైగానే టెక్నీషియన్లు తనదైన ఎఫర్ట్‌తో వర్క్ చేస్తారు. అలాగే ఈ సినిమాకి కూడా చాలా మంది టెక్నీషియన్లు పని చేశారు. ఇకపోతే, శంకర్ డైరెక్షన్ విషయానికి వస్తే, ఫస్టాఫ్ అంతా చాలా రొటీన్‌గా నడిపించేయడం నిరాశకు గురి చేస్తుంది. అయితే, సెకండాఫ్‌లోని ట్విస్టులు, స్టన్నింగ్ క్యారెక్టర్స్ బ్రేకింగ్ డాగ్స్ అంటూ సాగే యానిమేషన్ ఎపిసోడ్, విజువల్‌గా గ్రాండియర్ లుక్ శంకర్ టేకింగ్ టాలెంట్‌ని మరోసారి ప్రూవ్ చేస్తుంది.
ప్లస్ పాయింట్స్:
కమల్ హాసన్ పర్‌ఫామెన్స్, ఆయనపై చిత్రీకరించిన విభిన్న తరహా యాక్షన్ సీన్స్, సెకండాఫ్‌లోని ట్విస్టులు, భారీ విజువల్స్, గ్రాండియర్ అప్పియరెన్స్, ముఖ్యంగా మూడో పార్ట్ కోసం వదిలిన ఆశక్తికరమైన ట్విస్టులు.
మైనస్ పాయింట్స్:
చాలా చప్పగా సాగిన ఫస్టాఫ్, ఫ్లాట్‌గా సాగిన సమకాలీన అవినీతి సంఘటనలు, కమల్ హాసన్ సినిమా అనుకుని వెళితే, ఆయన పాత్రకు బదులు సిద్దార్ధ్ పాత్ర లెంగ్త్ ఎక్కువగా చూపించడం ముఖ్యంగా కమల్ ఫ్యాన్స్‌కి డైజెస్ట్ కాదు. చాలా చోట్ల అవుట్ డేటెడ్ అనిపించే సన్నివేశాలు, ఆకట్టుకోని అనిరుధ్ మ్యూజిక్..
చివరిగా:
శంకర్ టేకింగ్ గ్రాండియర్ లుక్స్, కమల్ హాసన్ పర్‌పామెన్స్ గురించి అయితే, ఈ సినిమాని ఒకసారి ధియేటర్లలో చూడొచ్చు. ‘భారతీయుడు’ రేంజ్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళితే నిరాశ తప్పదు. కేవలం ఇది ‘భారతీయుడు 2’ అంతే.. భారీ అంచనాలను అందుకోదగ్గ చిత్రమైతే కాదనేది సినిమా చూసిన వారిలో చాలా మంది అభిప్రాయం.
తాజా వార్తలు
- మహిళా టీ20 ప్రపంచకప్..భారత్ పై న్యూజిలాండ్ విజయం
- నిజమాబాద్: ముగ్గురి ఉసురు తీసిన ఆన్ లైన్ బెట్టింగ్..
- సీనియర్ హీరో రాజేంద్రప్రసాద్ ఇంట తీవ్ర విషాదం
- విద్యార్థుల నుంచి లంచం..టీచర్‌కు మూడేళ్ల జైలు, 5,000 దిర్హామ్‌ల జరిమానా..!!
- సౌదీయేతరులతోనే 64.8% సౌదీల వివాహాలు..అధ్యయనం వెల్లడి..!!
- షేక్ జాయెద్ రోడ్లో యాక్సిడెంట్.. 4.2 కి.మీ పొడవున ట్రాఫిక్ జామ్..!!
- దోహాలో రెండు కీలక రహదారులు తాత్కాలికంగా మూసివేత..!!
- కువైట్ లో తక్షణ చెల్లింపు కోసం 'WAMD' సర్వీస్ ప్రారంభం..!!
- మెట్రో రైడర్స్ కు గుడ్ న్యూస్.. ఈ-స్కూటర్లపై నిషేధం ఎత్తివేత..!!
- షార్ట్స్‌లో వీడియోల నిడివిని పెంచిన యూట్యూబ్