కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- July 13, 2024
న్యూ ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ప్రతి ఏడాది జూన్ 25న ‘రాజ్యాంగ హత్యాదినం’ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 49 ఏళ్ల క్రితం దేశంలో ఎమర్జెన్సీ విధించిన జూన్ 25వ తేదీని ‘సంవిధాన్ హత్యా దివస్’ (రాజ్యాంగ హత్యాదినం)గా పాటిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 1975, జూన్ 25న ఇందిరా గాంధీ నేతృత్వంలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో అత్యవసర పరిస్థితిని విధించడంతో రెండేళ్లపాటు పౌర హక్కులను భంగం కలిగింది. ఎమర్జెన్సీ రోజులను బీజేపీ పదే పదే గుర్తుకు తెస్తుంది.
‘సంవిధాన్ హత్యా దివస్’ను ప్రకటించిన గెజిట్ నోటిఫికేషన్ కాపీని కేంద్ర మంత్రి అమిత్ షా ఎక్స్‌లో ట్వీట్ చేశారు. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ నియంతృత్వ ఆలోచనా ధోరణిని ప్రదర్శిస్తూ ఎమర్జెన్సీని విధించారని అందులో పేర్కొన్నారు. ఎమర్జెన్సీ వల్ల ప్రజాస్వామ్యాన్ని ఊపిరి ఆడకుండా చేశారని చెప్పారు.
తప్పు చేయని లక్షలాది మందిని జైల్లో వేశారని తెలిపారు. మీడియా గళాన్నీ ఎత్తకుండా చేశారని అన్నారు. దీంతో భారత సర్కారు ప్రతి ఏడాది జూన్ 25వ తేదీని ‘సంవిధాన్ హత్యా దివస్’గా నిర్వహించాలని నిర్ణయించిందని స్పష్టం చేశారు. 1975 ఎమర్జెన్సీ సమయంలో జరిగిన అమానవీయ దుర్ఘటనలను ఎదుర్కొన్న వారిని జూన్ 25న భారత్ స్మరించుకుంటుందని చెప్పారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష
- ఏపీలో వేసవిని తలపిస్తున్న ఎండలు
- కల్తీ మద్యం తాగి 14 మంది మృతి..
- ISRO ప్రైవేటీకరణపై క్లారిటీ ఇవ్వండి
- సౌదీ-మలేషియా జాయింట్ ఆపరేషన్.. డ్రగ్ నెట్వర్క్ బస్ట్..!!
- హవల్లీ, ముబారక్ అల్-కబీర్ ప్రాంతాల్లో పలుచోట్ల పవర్ కట్..!!
- కతారా హాస్పిటాలిటీ.. హోటళ్లు, రిసార్టుల్లో 40 శాతం వరకు ఆదా..!!







