1000 కోట్ల కల్కి..రెండోసారి ప్రభాస్ సరికొత్త రికార్డ్..
- July 13, 2024
హైదరాబాద్: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ప్రభాస్ కల్కి సినిమా థియేటర్స్ లో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. సినిమాలో విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్ లు ప్రేక్షకులకు బాగా నచ్చేసాయి. ఇక కలెక్షన్స్ విషయంలో కూడా కల్కి సినిమా బాక్సాఫీస్ దగ్గర సునామి సృష్టిస్తుంది. కల్కి సినిమా మొదటి రోజు 191 కోట్ల గ్రాస్ వసూలు చేయగా 16 రోజులకు 1000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్టు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
కల్కి సినిమాలో ప్రభాస్ కాసేపు కర్ణుడిలా కనిపించిన సంగతి తెలిసిందే. ఆ కాసేపు విజువల్స్ కే ఫ్యాన్స్, ప్రేక్షకులు షాక్ అయ్యారు. నేడు మూవీ యూనిట్ ప్రభాస్ కర్ణుడి గెటప్ లో ఉన్న పోస్టర్ తో 1000 కోట్ల కలెక్షన్స్ పోస్టర్ అధికారికంగా రిలీజ్ చేయడంతో అభిమనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ పోస్టర్ కూడా వైరల్ గా మారింది.
ఇప్పటికే కల్కి సినిమా అనేక రికార్డులని కొల్లగొట్టింది. ప్రభాస్ బాహుబలి నుంచి ప్రతి సినిమాతో కొన్ని రికార్డులని సెట్ చేస్తూనే వస్తున్నాడు. ఈ కల్కి తో కూడా అనేక రికార్డులు సెట్ చేసాడు ప్రభాస్. రెండు సినిమాలు 1000 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఏకైక సౌత్ హీరోగా ప్రభాస్ నిలిచాడు. బాహుబలి 2 తర్వాత కల్కి 1000 కోట్లు సాధించింది. ఈ విషయంలో ప్రభాస్ షారుఖ్ ని సమం చేసాడు. ఇక కల్కి సినిమా అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయి ఫుల్ ప్రాఫిట్స్ తో దూసుకుపోతుంది.
తాజా వార్తలు
- సోషల్ మీడియా దుర్వినియోగం పై సీఎం చంద్రబాబు హెచ్చరిక
- మెడికవర్ హాస్పిటల్స్ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి లివర్ మార్పిడి
- 43 గంటలు నాన్-స్టాప్‌గా నడువనున్న దుబాయ్ మెట్రో..!!
- ఒమన్‌లో 2,510 క్యాన్సర్ కేసులు నమోదు..!!
- సౌదీ అరేబియాలో 2,200 హోండా కార్లు రీకాల్..!!
- కతారాలో 'ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ' ప్రదర్శన..!!
- హెయిర్ డై వల్ల గాయాలు, BD5,000 కేసును తిరస్కరించిన కోర్టు..!!
- కువైట్ లో 15 ప్రైవేట్ ఫార్మసీలు సీజ్..!!
- 2026 జనవరి 1 నుంచి రాబోయే అతిపెద్ద మార్పులివే..
- వైభవ్‌కు ప్రతిష్ఠాత్మక బాల్ పురస్కార్







