TTD కీలక అప్​ డేట్

- July 14, 2024 , by Maagulf
TTD కీలక అప్​ డేట్

తిరుమల: శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక అప్డేట్ ఇచ్చింది. తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 16న సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపింది.

దీంతో జులై 16న తిరుమలలో బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. జులై 15న ఎలాంటి సిఫారసు లేఖలు స్వీకరించబడవని టీటీడీ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని ఓ ప్రకటనలో కోరింది.

సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని నిర్వహిస్తుంటారు. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే తిరుమంజనం కార్యక్రమం సుమారు 5 గంటలపాటు కొనసాగుతుందని టీటీడీ తెలిపింది. తిరుమంజనం కార్యక్రమం అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు ఆలయ అర్చకులు ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు.అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. తిరుమంజనం కారణంగా మంగళవారంనాడు ( జులై 16) నిర్వహించే అష్టదళ పాద పద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది.

తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో జులై నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. జులై 13, 20, 27వ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీసీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం, సాయంత్రం 5 గంటలకు ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.జులై 16న ఆణివార ఆస్థానం ఉంటుంది. జులై 30 నుండి ఆగస్టు 2వ తేదీ వరకు పవిత్సోత్సవాలు జరుగుతాయని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com