బాహుబలి సెట్ లో సందడి చేసిన ప్రియమణి

- June 14, 2016 , by Maagulf
బాహుబలి సెట్ లో సందడి చేసిన ప్రియమణి

ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'బాహుబలి-2' సినిమా సెట్‌లో సోమవారం నటి ప్రియమణి సందడి చేశారు. కొంత సమయం సెట్‌లో గడిపి విమానాశ్రయానికి చేరుకున్నట్లు ప్రియమణి తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలిపారు. సెట్‌లోకి తనను అనుమతించి, చరిత్రాత్మక యుద్ధ సన్నివేశాన్ని చూడనిచ్చినందుకు యూనిట్‌ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ చిత్రం విడుదల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు ట్వీట్‌ చేశారు.
దీనికి చిత్ర బృందం తమ ట్విట్టర్‌ ఖాతా ద్వారా స్పందిస్తూ.. మీరు మా సెట్‌కు రావడం సర్‌ప్రైజ్‌గా భావించాం. మీరు ఏమి చూశారో..
అది మీకు నచ్చిందనుకుంటున్నాం అని ట్వీట్‌ చేసింది. అంతేకాదు ప్రియమణి రాకపై ట్విట్టర్‌ వేదికగా ఆమెకు, యూనిట్‌ సభ్యులు రానా, సెంథిల్‌కుమార్‌, లీ విట్టేకర్‌కి మధ్య సంభాషణ జరిగింది. సెట్‌కు ఎప్పుడు వచ్చావని, ఎందుకు హాయ్‌ చెప్పలేదని వీరు ప్రియమణిని ప్రశ్నించారు. 'యమదొంగ' చిత్రం కోసం రాజమౌళి, ప్రియమణి కలిసి పని చేశారు. రాజమౌళి షూటింగ్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటకు వెళ్లకుండా చాలా జాగ్రత్త పడతారన్న సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com