బాహుబలి సెట్ లో సందడి చేసిన ప్రియమణి
- June 14, 2016
ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'బాహుబలి-2' సినిమా సెట్లో సోమవారం నటి ప్రియమణి సందడి చేశారు. కొంత సమయం సెట్లో గడిపి విమానాశ్రయానికి చేరుకున్నట్లు ప్రియమణి తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. సెట్లోకి తనను అనుమతించి, చరిత్రాత్మక యుద్ధ సన్నివేశాన్ని చూడనిచ్చినందుకు యూనిట్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ చిత్రం విడుదల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు ట్వీట్ చేశారు.
దీనికి చిత్ర బృందం తమ ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ.. మీరు మా సెట్‌కు రావడం సర్ప్రైజ్గా భావించాం. మీరు ఏమి చూశారో..
అది మీకు నచ్చిందనుకుంటున్నాం అని ట్వీట్ చేసింది. అంతేకాదు ప్రియమణి రాకపై ట్విట్టర్ వేదికగా ఆమెకు, యూనిట్ సభ్యులు రానా, సెంథిల్‌కుమార్, లీ విట్టేకర్కి మధ్య సంభాషణ జరిగింది. సెట్‌కు ఎప్పుడు వచ్చావని, ఎందుకు హాయ్ చెప్పలేదని వీరు ప్రియమణిని ప్రశ్నించారు. 'యమదొంగ' చిత్రం కోసం రాజమౌళి, ప్రియమణి కలిసి పని చేశారు. రాజమౌళి షూటింగ్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటకు వెళ్లకుండా చాలా జాగ్రత్త పడతారన్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన







