కాలిన గాయాల పై ఐస్ క్యూబ్స్ పెట్టడం మంచిదేనా.?
- July 14, 2024
అనుకోకుండా అప్పుడప్పుడూ చిన్న చిన్న కాలిన గాయాలవుతుంటాయ్. అలాంటప్పుడు వెంటనే ఇంట్లో వుండే టూత్ పేస్ట్ కానీ, చల్లని పాలను కానీ, లేదంటే ప్రిజ్‌లో వుండే ఐస్ క్యూబ్స్ కానీ పెట్టేస్తుంటాం.
లేదంటే నెయ్యి లేదా చల్లని నూనె కూడా రాస్తుంటారు కొందరు. కానీ, కాలిన గాయాలపై అలాంటివేమీ పూయరాదని నిపుణులు చెబుతున్నారు. అలా చేయడం వల్ల ఆ ప్రదేశంలో రక్త ప్రసరణ నిలిచిపోయే ప్రమాదం వుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరి కాలిన గాయానికి ఇన్‌స్టెంట్ చికిత్స అదేనండీ ప్రధమ చికిత్స ఏం చేయాలి.? అంటే, ముందుగా కాలిన ప్రదేశాన్ని రన్నింగ్ ట్యాప్ కింద వుంచాలట. అలా చేయడం వల్ల అక్కడ దుమ్ము, ధూళి, బాక్టీరియా శుభ్రమవుతాయ్.
ఆ తర్వాత బర్నింగ్ క్రీమ్ పూతగా పూయాలి. బర్నింగ్ క్రీమ్ అందుబాటులో లేకపోవడం వల్లనే నూనె రాయడం, నెయ్యి పూయడం లేదంటే ఐస్ క్యూబ్స్ పెట్టడం చేస్తుంటారు.
అలా చేయడం కన్నా, అలోవెరా జెల్‌ని కాలిన ప్రదేశంలో స్మూత్‌గా రాయడం మంచిదని అంటున్నారు. అలాగే రోజ్ వాటర్ కూడా మంచిదే. అంతేకానీ, టూత్ పేస్ట్ పెట్టడం మాత్రం అస్సలు మంచిది కాదని చెబుతున్నారు. అయితే, వంట చేసినప్పుడు వంటి చిన్నపాటి గాయాలకు మాత్రమే ఈ చిన్న చిట్కా పని చేస్తుంది.
పెద్ద పెద్ద కాలిన గాయాలకు మాత్రం అస్సలు అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించాలని సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- న్యూఇయర్ వేడుకలు..హద్దు మీరితే కఠిన చర్యలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్‌లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!
- జెబెల్ జైస్‌లో బేర్ గ్రిల్స్ క్యాంప్ రీ ఓపెన్..!!
- భారత్ తో CEPA..ఆందోళనల పై స్పందించిన ఒమన్..!!
- బహ్రెయిన్ లకే వెహికల్ టెక్నికల్ ఇన్స్పెక్టర్ పోస్టులు..!!
- రియాద్ మెట్రో వార్షిక, టర్మ్ టిక్కెట్ల ధరలు వెల్లడి..!!
- 2026 సంవత్సర క్యాలెండర్, డైరీని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
- తెలంగాణలో వారందరికీ బిగ్‌షాక్..
- తొలి మూడు రోజులు టోకెన్లున్న భక్తులకే వైకుంఠ దర్శనం:టి.టి.డి చైర్మన్







