తెరుచుకున్న రత్న భాండాగారం తలుపులు, అధికారికంగా ప్రకటించిన ప్రభుత్వం

- July 14, 2024 , by Maagulf
తెరుచుకున్న రత్న భాండాగారం తలుపులు, అధికారికంగా ప్రకటించిన ప్రభుత్వం

ఒడిశా: ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రత్న భాండాగారం తెరుచుకుంది. మధ్యాహ్నం 1.28 గంటలకు ప్రత్యేక పూజల నిర్వహించి కలెక్టర్, హైలెవల్ కమిటీ పర్యవేక్షణలో రహస్య గది తలుపులను తెరిచారు. జగన్నాథుడి సేవలకు అంతరాయం కలగకుండా తలుపులను తెరిచారు. 11మంది ఈ ప్రక్రియలో పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు. 46ఏళ్ల క్రితం అంటే 1978లో చివరిసారిగా దీన్ని తెరిచారు.రత్నభండార్ లోకి కమిటీ సభ్యులు ప్రవేశించారు. మొత్తం ప్రక్రియను కమిటీ సభ్యులు  వీడియో తీస్తున్నారు. స్వామివారి నగలు, ఆభరణాలు తరలించేందుకు బాక్సులను అధికారులు సిద్ధం చేశారు. కాసేపట్లో రత్న భాండాగారంలోని ఆభరణాల లెక్కింపు, తదితర ప్రక్రియను చేపట్టనున్నారు. 1978లో సంపదను లెక్కించడానికి 72 రోజులు సమయం పట్టింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com