DXB టెర్మినల్ 3 సందర్శించిన షేక్ మొహమ్మద్
- July 14, 2024
యూఏఈ: దుబాయ్ ఇంటర్నేషనల్ (DXB) టెర్మినల్ 3లో జరుగుతున్న పనుల పురోగతిని UAE వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ పరిశీలించారు.షేక్ మహ్మద్ వ్యక్తిగతంగా విమానాశ్రయంలోని కార్యకలాపాలను పరిశీలించారు. బయలుదేరే మరియు వచ్చే ప్రయాణీకులకు అందిస్తున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. బయలుదేరే మరియు వచ్చే ప్రయాణీకులకు అందించిన నాణ్యమైన సౌకర్యాలపై విమానాశ్రయ అధికారులు వివరించారు. టెర్మినల్ 3లో జరిగిన అభివృద్ధిని షేక్ మొహమ్మద్ అభినందించారు.
2024 మొదటి త్రైమాసికంలో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగి 23 మిలియన్లకు చేరుకుంది. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇది 8.4% పెరిగింది.షేక్ మహమ్మద్‌తో పాటు దుబాయ్‌లోని స్టేట్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ తలాల్ హుమైద్ బెల్హౌల్ కూడా ఉన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..