షార్జా టవర్ నుంచి పడి 4 ఏళ్ళ బాలుడి మృతి
- June 14, 2016
నాలుగేళ్ళ అల్జీరియా బాలుడు షార్జాలోని అల్ ముహారియా ప్రాంతంలోని ఓ భవనం 18వ అంతస్తు నుంచి కిందికి పడి అక్కడికక్కడే చనిపోయాడు. ఘటన గురించి తెలుసుకున్న వెంటనే అంబులెన్స్ మరియు అల్ బుహారియా పోలీస్ స్టేషన్ పెట్రోల్స్ ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అయితే అప్పటికే తీవ్ర గాయాలతో ఆ బాలుడు చనిపోయాడు. అల్ ఖాసిమి ఆసుపత్రికి బాలుడి మృత దేహాన్ని తరలించారు. ఇంట్లోని ఫర్నిచర్ ద్వారా విండో చేరుకున్న బాలుడు, అక్కడి నుంచి పడిపోయినట్లుగా పోలీసులు వెల్లడించారు. బాలుడి తల్లిదండ్రుల్ని పోలీసులు విచారిస్తున్నారు. యూఏఈలోని వ్యాప్తంగా ఇలాంటి మరణాలు చోటు చేసుకుంటుండడంతో హైరైజ్ భవనాలకు మరింత కఠినంగా సేఫ్టీ రూల్స్‌ని అమలు చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలనీ, నిర్లక్ష్యం ప్రదర్శిస్తే తల్లిదండ్రులపైనా చర్యలుంటాయని పోలీసులు హెచ్చరించారు. ఎత్తయిన భవనాల విషయంలోనే కాకుండా, కత్తి లాంటి పదునైన వస్తువుల విషయంలో కూడా తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని కోరారు అధికారులు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







