బైజూస్‌పై బీసీసీఐ పిటిషన్.. దివాలా ప్రక్రియకు అనుమతి
- July 16, 2024
బెంగళూరు: ప్రముఖ ఎడ్‌టెక్ సంస్థ బైజూస్‌కు మరో షాక్ తగిలింది. స్పాన్సర్‌షిప్ బకాయిల వ్యవహారంలో బీసీసీఐ దాఖలు చేసిన దివాలా ప్రక్రియకు నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (NCLT) బెంగళూరు బెంచ్ అనుమతించింది.
భారత క్రికెట్ టీమ్‌కు స్పాన్సర్‌షిప్‌నకు సంబంధించి రూ.160 కోట్లు చెల్లించలేదన్నది బీసీసీఐ ఆరోపణ.
బైజూస్ ఓ దశలో వెలుగు వెలిగినప్పుడు బీసీసీఐ స్పాన్సర్‌గా వ్యవహరించింది. 2023 నవంబర్ వరకు జెర్సీ స్పాన్సర్‌గా బైజూస్ వ్యవహరించాల్సిఉండగా.. అర్ధంతరంగా అది వైదొలిగింది. ఈనేపథ్యంలో కాంట్రాక్ట్ ముగిసినా రూ.160 కోట్లు బకాయిలు చెల్లించకపోవడంపై గతేడాది నవంబర్‌లో బైజూస్‌పై ఎన్‌సీఎల్‌టీ కేసు నమోదైంది. అప్పట్లో బీసీసీఐతో చర్చించి ఈ సమస్యను పరిష్కరించుకుంటామని కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు. ఒక్క బీసీసీఐ మాత్రమే కాదు.. ఫిఫా, ఐసీసీ వంటి బ్రాండ్లకూ బీసీసీఐ స్పాన్సర్‌గా వ్యవహరించింది. 2023 నుంచి వాటి రెన్యువల్‌ను నిలిపివేసింది.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్‌లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







