గోపీచంద్ సినిమాలో ప్రబాస్ అలా.!

- July 16, 2024 , by Maagulf
గోపీచంద్ సినిమాలో ప్రబాస్ అలా.!

మ్యాచో స్టార్ గోపీచంద్, యూనివర్సల్ హీరో ప్రబాస్.. ఇద్దరూ మంచి స్నేహితులన్న సంగతి చాలా మందికి తెలుసు. ఇద్దరూ కలిసి కెరీర్ తొలి నాళ్లలో ‘వర్షం’ సినిమాలో నటించారు.

ఆ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ సెట్ కాలేదు. అప్పట్లో గోపీచంద్ విలన్‌గా నటించిన సినిమా అది. ఆ తర్వాత ఆయన హీరోగా మారడం.. ప్రబాస్ రేంజ్ యూనివర్స‌ల్ స్థాయిని అందుకోవడం.. దాంతో,   ఈ కాంబోని సెట్ చేయడం సెట్ కాలేదు మన తెలుగు మేకర్లకి.

చాలా సార్లు ఈ ఇద్దరూ మేమిద్దరం కలిసి మళ్లీ సినిమా చేయాలనుంది.. అంటూ పదే పదే పలు ఇంటర్వ్యూల్లో చెప్పిన సంగతి కూడా తెలిసిందే. అయితే, ఆ మాట ఇప్పుడు నిజం కాబోతోందనిపిస్తోంది.

గోపీచంద్ సినిమాలో ప్రబాస్ కనిపించబోతున్నాడట.. కాదు కాదు వినిపించబోతున్నాడట. అదేనండీ. గోపీచంద్ సినిమాకి ప్రబాస్ తన వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాడనీ ఇన్‌సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం.

గోపీచంద్ ప్రస్తుం ‘విశ్వం’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి టి.జి.విశ్వ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఈ సినిమాలో గోపీచంద్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్‌కి సంబంధించి బ్యాక్ గ్రౌండ్‌లో వచ్చే వాయిస్‌ని ప్రబాస్‌తో చెప్పించాలని అనుకుంటున్నారట. నిజమో కాదో తెలియాలంటే లెట్స్ వెయిట్ అండ్ సీ ఫర్ సమ్ టైమ్.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com