ప్రవాసుసులకు శుభవార్త..ఫ్యామిలీ వీసాలో మార్పులు

- July 16, 2024 , by Maagulf
ప్రవాసుసులకు శుభవార్త..ఫ్యామిలీ వీసాలో మార్పులు

కువైట్: యూనివర్శిటీ డిగ్రీ లేని ప్రవాసిని కూడా కుటుంబ వీసాపై తన భార్య,  పిల్లలను తీసుకురావడానికి అంతర్గత మంత్రిత్వ శాఖ అనుమతించింది. ఈ మేరకు కుటుంబ వీసా కోసం సవరణను ఆమోదించింది.  మొదటి ఉప ప్రధాన మంత్రి, రక్షణ మంత్రి మరియు అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ ఫహద్ అల్-యూసెఫ్ కుటుంబ వీసా కోసం సవరణను ఆమోదించారు. వర్క్ పర్మిట్‌పై జీతం 800 దినార్‌లు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే, అతని భార్య మరియు పిల్లలను 14 ఏళ్లలోపు కుటుంబ వీసా కింద తీసుకురావడానికి తాజాగా అనుమతి లభిస్తుంది.  ఈ సంవత్సరం ప్రారంభంలో కువైట్ ప్రవాసుల కోసం కుటుంబ వీసాను ప్రారంభించింది. ఇక్కడ వర్క్ పర్మిట్‌పై 800 దినార్ జీతం మరియు దరఖాస్తుదారుకి విశ్వవిద్యాలయ డిగ్రీ ఉండాలని నిబంధనలు విధించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com