కవలల విభజనపై సౌదీలో అంతర్జాతీయ సదస్సు

- July 16, 2024 , by Maagulf
కవలల విభజనపై సౌదీలో అంతర్జాతీయ సదస్సు

రియాద్: సౌదీ కవలల కార్యక్రమం 30వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్ 24-25 తేదీలలో అంతర్జాతీయ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు కింగ్ సల్మాన్ హ్యుమానిటేరియన్ ఎయిడ్ అండ్ రిలీఫ్ సెంటర్ (KSrelief) వెల్లడించింది. ఈ ఈవెంట్‌లో మంత్రులు, నాయకులు మరియు గ్లోబల్ ఎక్స్‌పర్ట్స్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్య , మానవతా రంగాలకు చెందిన నిపుణులలు పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశం సౌదీ అరేబియా వినతి మేరకు ఐక్యరాజ్యసమితి ఇటీవల ఆమోదించిన అంతర్జాతీయ కవలల దినోత్సవం పురస్కరించుకుని ఉంటుందన్నారు.

ఈ కాన్ఫరెన్స్ 1990లో సౌదీ కంజాయిన్డ్ ట్విన్స్ ప్రోగ్రామ్‌తో ప్రారంభమైన ఈ రంగంలో సౌదీ అరేబియా మార్గదర్శక ప్రయత్నాలను హైలైట్ చేస్తుంది. అవిభక్త కవలల కేసులపై దృష్టి సారిస్తుంది. గత 34 సంవత్సరాలలో విజయవంతంగా 61 వేరు శస్త్రచికిత్సలను నిర్వహించింది. 26 దేశాల నుండి 139 కేసులను విజయవంతంగా నిర్వహించారు.   ఈ కాన్ఫరెన్స్ ప్రపంచవ్యాప్తంగా కవలల విభజనలో సౌదీ అరేబియా విస్తృతమైన అనుభవాన్ని ప్రదర్శిస్తుందని పేర్కొన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com