కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి అరుదైన ఆహ్వానం!!
- July 17, 2024
ఢిల్లీ: కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి, శ్రీకాకుళం టీడీపీ లోక్‌సభ సభ్యుడు కె.రామ్మోహన్ నాయుడుకి అరుదైన గౌరవం లభించింది. ఆయన నీతి ఆయోగ్ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమితులయ్యారు.
కేంద్రంలో కొత్తమంత్రి వర్గం ఏర్పడిన నేపథ్యంలో నీతి ఆయోగ కూర్పును సవరించారు. ఎక్స్ అఫీషియో సభ్యుల జాబితాలో కొత్త వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు చోటు కల్పించారు.
అలాగే, ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో కేంద్రమంత్రులు జేపీ నడ్డా (వైద్య ఆరోగ్యం), కె.రామ్మోహన్ నాయుడు (పౌర విమానయాన శాఖ), హెచ్.డి కుమార స్వామి (ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ), జితన్ రాం మాంఝీ (ఎంఎస్ఎంఈ), రాజీవ్ రంజన్ సింగ్ (పంచాయతీ రాజ్, పశుసంవర్థకం), జూయెల్ ఓరం (గిరిజన వ్యవహారాలు), అన్నపూర్ణాదేవి (మహిళా శిశు సంక్షేమ), చిరాగ్ పాశ్వాన్ (ఆహారశుద్ధి, పరిశ్రమలు)లను చేర్చారు.
తాజా వార్తలు
- టీ20 సిరీస్ టీమిండియాదే
- మేరీల్యాండ్‌లో మెరిసిన తెలుగు ఆణిముత్యాలు
- ముసాందంలో వరదల్లో డ్రైవింగ్.. డ్రైవర్ అరెస్ట్..!!
- అత్యున్నత పురస్కారాల్లో ప్రధాని మోదీ రికార్డు..!!
- ఏనుగు సజీవ దహనం..ముగ్గురు అరెస్ట్..!!
- 72 మిలియన్ గ్యాలన్ల రెయిన్ వాటర్ తొలగింపు..!!
- మెచ్యూరిటీ ఇండెక్స్ 2025లో సౌదీకి రెండో స్థానం..!!
- యూఏఈలో రెయిన్స్ తగ్గుముఖం..!!
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'







