గ్లోబల్ యాక్ట్రస్ ...!
- July 18, 2024
ప్రియాంక చోప్రా...బాలీవుడ్ నుంచి హాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న నటి. రెండు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తూ, తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చున్న వ్యక్తుల్లో ప్రియాంక ఒకరు. ప్రపంచ సుందరి కిరీటాన్ని చేజిక్కించుకున్న రెండో భారతీయురాలిగా సైతం ప్రియాంక పేరు తెచ్చుకున్నారు. నేడు ప్రియాంక పుట్టిన రోజు.
పీసీ అలియాస్ ప్రియాంక చోప్రా 1982, జూలై 18న జార్ఖండ్‌లోని జంషెడ్పూర్ నగరంలో జన్మించింది. ప్రియాంక తల్లిదండ్రులు అశోక్, మధు చోప్రాలు ఇద్దరూ ఇండియన్ ఆర్మీలో డాక్టర్లే. తల్లితండ్రుల ఉద్యోగ రీత్యా కావటం వలన వారు తరచుగా ప్రాంతాలు మారుతూ ఉండేవారు.13 ఏళ్ల వయసులో పై చదువుల కోసం అమెరికా వెళ్లారు ప్రియాంక. వాళ్ళ అత్తయ్య కుటుంబం అక్కడ ఉండడంతో వాళ్ల ఇంట్లో ఉండి చదువు కొన్నారు. క్లాసికల్ మ్యూజిక్, కోరల్ సింగింగ్ కూడా నేర్చుకున్నారు. ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత హయ్యర్ స్టడీస్ ఇక్కడే పూర్తి చేశారు.
ప్రియాంక తల్లి మధు ప్రోద్బలంతో అందాల పోటీలకు తయారయ్యేది. 2000వ సంవత్సరంలో ఫెమినా మిస్ ఇండియా పోటీలకు వాళ్ళ అమ్మ పంపించారు. ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ పోటీల్లో ప్రియాంకకు రెండో స్థానం లభించింది. ఆ ఉత్సాహంతో 2000లో ప్రపంచ సుందరి కిరీటాన్ని అందుకున్న ఐదవ భారతీయ మహిళగా ప్రియాంక చరిత్ర సృష్టించింది. ఆమె కన్న ముందు 1967లో రీటా ఫారియా, 1994లో ఐశ్వర్యారాయ్, 1997లో డయానా హెడెన్, 1999లో యుక్తాముఖిలు ప్రపంచ సుందరి కిరీటాన్ని అందుకున్నారు. అదే సంవత్సరంలో లారా దత్తా, దియా మిర్జా విశ్వ సుందరి, ఆసియా పసిఫిక్ సుందరి కిరీటాలను కైవసం చేసుకున్నారు. వీరు ముగ్గురు తర్వాత కాలంలో బాలీవుడ్ హీరోయిన్స్ అయ్యారు.
ప్రపంచ సుందరి బిరుదు దక్కించుకున్న తరువాత చోప్రా 2002లో కోలీవుడ్ హీరో విజయ్ సరసన తమిళ చిత్రం తమిళన్ లో నటిచింది. ఆపై బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. 2003లో తన మొట్టమొదటి బాలీవుడ్ చిత్రం ది హీరో: లవ్ స్టొరీ ఆఫ్ ఎ స్పై విడుదలై నటిగా మంచి మార్కులు వేసుకుంది. ఆతర్వాత అందాజ్ (2003), ముజ్సే షాదీ కరోగి (2004) వంటి హిట్ సినిమాల్లో నటించింది. 2004 రొమాంటిక్ థ్రిల్లర్ ఐత్రాజ్లో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. మొదట్లో అందానికి ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో ఒదిగి పోయారు. ఆ తర్వాత అభినయానికి ఆస్కారం ఉన్న పాత్రలతో మెప్పించి జాతీయ అవార్డులు కూడా పొందారు. ప్రియాంక ఇండియాలోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్ గా సైతం రికార్డ్ సృష్టించారు.
ఇదే సమయంలో హాలీవుడ్ చిత్రాల్లో నటించే అవకాశాలు రావడంతో బాలీవుడ్ కు గుడ్ బై చెప్పి హాలీవుడ్ సినిమాల్లో బిజీగా ఉంది. టైమ్ మ్యాగజైన్ ప్రియాంక చోప్రాను ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తులలో పేర్కొంది. ఆమె స్త్రీల హక్కులూ, ఎన్విరాన్మెంట్, జెండర్ ఈక్వాలిటీ వంటి సామాజిక అవగాహనా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. 2006 నుండి యునిసెఫ్ తో కలిసి వర్క్ చేస్తున్నారు.
బర్త్‌డే గర్ల్, ప్రియాంక చోప్రా నికర విలువ US $90 మిలియన్లు (సుమారు రూ. 620 కోట్లు). ఆమె ఒక్కో సినిమాకు US $1,33,862.08 (INR 12 కోట్లు) వసూలు చేస్తుంది. హాలీవుడ్లో, ఆమె ఒక షోలో పనిచేస్తున్నప్పుడు ఒక్కో ఎపిసోడ్‌కు US $2,43,437 (సుమారు 2 కోట్ల రూపాయలు) వసూలు చేస్తుంది. ఆమె నెలవారీ జీతం దాదాపు US $1,82,569.95 (INR 1.5 కోట్లు) వుండవచ్చునని అంచనా. ముంబైలో రెండు లగ్జరీ హౌస్‌లతో పాటు... లాస్ ఏంజిల్స్‌లోని US $20 మిలియన్ల (సుమారు INR 238 కోట్లు) విలువైన ఇల్లు కూడా ఉంది.
సినిమాల్లో పనిచేయడమే కాకుండా, నటి సంపాదనలో ఎక్కువ భాగం ఆమె బ్రాండ్ ఎండార్స్మెంట్ల నుండి వస్తుంది. గ్లోబల్ ఐకాన్ ప్రతి ఎండార్స్‌మెంట్‌కు US $6,08,609.50 (సుమారు 5 కోట్ల రూపాయలు) వసూలు చేస్తుంది. ఆమె గార్నియర్, కోల్గేట్, వంటి ఇతర ప్రముఖ బ్రాండ్లతో పని చేసింది.
తాజా వార్తలు
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్‌లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్‌లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ
- ప్రభుత్వ AI ఇండెక్స్..సౌదీ అరేబియా నెంబర్ వన్..!!
- స్మార్ట్‌ఫోన్ యూజర్స్ ను హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం
- యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి: గవర్నర్ హరిబాబు
- పలు దేశాల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిషేధం
- రికార్డు సృష్టించిన స్మృతి మంధాన







