దుబాయ్ లో 256 మంది ప్రాపర్టీ బ్రోకర్లకు జరిమానా
- July 18, 2024
దుబాయ్: 2024 ప్రథమార్థంలో ప్రకటనల నిబంధనలు, షరతులను పాటించనందుకు 256 మంది ప్రాపర్టీ బ్రోకర్లకు జరిమానా విధించినట్లు దుబాయ్ ల్యాండ్ డిపార్ట్మెంట్(DLD) తెలిపింది. రెగ్యులేటర్ విడుదల చేసిన ఒక ప్రకటనలో చట్టాలకు కట్టుబడినందుకు 1,200 కంటే ఎక్కువ చట్టపరమైన హెచ్చరికలు కూడా జారీ చేసినట్టు వెల్లడించింది. 2024 ప్రథమార్థంలో DLD ఇన్స్పెక్టర్లు 450 క్షేత్ర తనిఖీలతోసహా మొత్తం 1,530 తనిఖీలు నిర్వహించారని రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ ఏజెన్సీలోని రియల్ ఎస్టేట్ నియంత్రణ విభాగం డైరెక్టర్ అలీ అబ్దుల్లా అల్ అలీ తెలిపారు.
“ఎమిరేట్‌లోని రియల్ ఎస్టేట్ రంగాన్ని నియంత్రించే నిబంధనలకు అన్ని పార్టీలు కట్టుబడి ఉండేలా పర్యవేక్షణ, తనిఖీ యంత్రాంగాలను అభివృద్ధి చేయడంపై మేము నిరంతరం కృషి చేస్తాము. మార్కెట్ స్థిరత్వం మరియు అభివృద్ధిని నిర్వహించడానికి DLD జారీ చేసిన సూచనలు, ఆదేశాలకు పూర్తిగా కట్టుబడి ఉండాలని మేము అన్ని రియల్ ఎస్టేట్ బ్రోకర్లు మరియు కంపెనీలను కోరుతున్నాము. DLD ఆమోదించని ఎటువంటి ఆస్తి ప్రకటనలకు రెస్పాండ్ కావొద్దని పిలుపునిస్తున్నాము.”అని అల్ అలీ అన్నారు.
తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్‌లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్‌లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







