మైక్రోసాఫ్ట్ బగ్..ప్రభావితమై కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయ కార్యకలాపాలు
- July 20, 2024
కువైట్: మైక్రోసాఫ్ట్ సేవల్లో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాలలు ప్రభావితం అయ్యాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) తెలిపింది. డిజిసిఎ అధికార ప్రతినిధి అబ్దుల్లా అల్-రాజి మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగం తీవ్రంగా ప్రభావితం అయిందన్నారు. కువైట్ ఎయిర్వేస్, జజీరా ఎయిర్వేస్ మరియు అంతర్జాతీయ విమానాశ్రయంలో పనిచేస్తున్న ఇతర సంస్థల సేవల్లో అంతరాయం ఏర్పడిందన్నారు. కువైట్ ఎయిర్వేస్ గ్లోబల్ అంతరాయానికి సంబంధించి ఇటీవలి పరిణామాలను ఫాలో చేస్తున్నట్లు ట్వీట్ చేసింది. కువైట్‌కు చెందిన జజీరా ఎయిర్వేస్ తన ఆపరేటింగ్ సిస్టమ్‌లు సాంకేతిక లోపంతో దెబ్బతిన్నాయని తెలిపింది. మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో సహా దాని అనేక అప్లికేషన్లు, సేవలను ప్రభావితం చేసిందని, బ్యాంకులు, విమానాలు మరియు మీడియా అవుట్లెట్లను ప్రభావితం చేసిందని మైక్రోసాఫ్ట్ తెలిపింది.
తాజా వార్తలు
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!
- ఒమన్ లో చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- బహ్రెయన్ లో బీభత్సం సృష్టించిన వర్షాలు..!!
- ఎంపీలకు తేనీటి విందు ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా..
- డిసెంబర్ 31లోపు ఈ పనులు చేయకపోతే భారీ జరిమానా!
- తిరుమల వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త







