తెలుగు రాష్ట్రాల్లో వానలే..వానలు
- July 20, 2024
హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మూలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో గత మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. దీంతో వాగులు , వంకలు పొంగిపొర్లుతున్నాయి. అనేక చోట్ల చెరువులు అలుగులు పడడంతో పలు చోట్ల రోడ్లు తెగి రవాణా వ్యవస్థ కు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అయితే ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ఉంది. 20 డిగ్రీల ఉత్తర అక్షాంశం ద్వారా సముద్ర మట్టానికి 3.1 కి.మీ. ఎత్తు నుండి 5.8 కి.మీ మధ్యలో కొనసాగుతుంది. ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతం మీదుగా వాయుగుండంగా బలపడిన అల్పపీడనం నేడు వాయువ్య దిశగా పయనించి పూరీ సమీపంలో ఒడిశా తీరం దాటే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ఉండగా.. పది జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఉత్తర తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో ఉదయం నుంచి మళ్లీ వర్షం మొదలైంది. మధ్యాహ్నం 3 గంటల వరకు వర్షం కురుస్తుంది. ఉదయం 10 గంటల తర్వాత వర్షం పెరుగుతుంది. హైదరాబాద్, ఉత్తర, పశ్చిమ తెలంగాణలో సాయంత్రం 5 గంటల తర్వాత భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణలో రాత్రి 9 గంటల తర్వాత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
తాజా వార్తలు
- సౌదీ-మలేషియా జాయింట్ ఆపరేషన్.. డ్రగ్ నెట్వర్క్ బస్ట్..!!
- హవల్లీ, ముబారక్ అల్-కబీర్ ప్రాంతాల్లో పలుచోట్ల పవర్ కట్..!!
- కతారా హాస్పిటాలిటీ.. హోటళ్లు, రిసార్టుల్లో 40 శాతం వరకు ఆదా..!!
- దుబాయ్ హోటల్ ధరలకు రెక్కలు..175 శాతం వరకు పెంపు..!!
- ఒమన్ లో స్కూల్ బస్సు డ్రైవర్లకు పోలీసుల కీలక సూచనలు..!!
- బహ్రెయిన్‌లో మత బోధన, కార్యకలాపాలకు కొత్త నిబంధనలు..!!
- ప్రపంచ సుందరిగా జొహైరీ మోలా..
- వాట్సాప్‌లో అదిరిపోయే AI ఫీచర్..!
- సౌదీలో వారం రోజుల్లో 12,363 మంది నివాసితులపై బహిష్కరణ వేటు..!!
- కింగ్ ఫహద్ కాజ్‌వేపై బహ్రెయిన్–సౌదీ ట్యాక్సీలకు అనుమతి..!!







