పనిచేసే సంస్థలో చోరీ.. ప్రవాస ఉద్యోగిపై విచారణ
- July 21, 2024
కువైట్: కువైట్ ఆయిల్ కంపెనీ (KOC)లో పనిచేస్తున్న 40 ఏళ్ల ప్రవాసుడు, అతని వాహనంలో 145 ఇనుప క్లిప్‌లను చోరీ చేసిన ఘటనలో అతన్ని విచారించడానికి అల్-ఖషానియా ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్కు రెఫర్ చేశారు. ప్రవాసుడు KOCలో సెక్యూరిటీ మరియు భద్రతా సిబ్బందిగా పనిచేస్తున్నాడు. అతను కంపెనీ ప్రధాన కార్యాలయం నుండి వస్తువులను చోరీ చేస్తున్నట్లు గుర్తించారు. అతని ప్రైవేట్ కారులో చోరీ వస్తువులను తరలిస్తుండగా గుర్తించారు. విచారణలో వస్తువులను దొంగిలించానని ప్రవాసుడు అంగీకరించాడని, గతంలో జరిగిన దొంగతనాలపై విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ-మలేషియా జాయింట్ ఆపరేషన్.. డ్రగ్ నెట్వర్క్ బస్ట్..!!
- హవల్లీ, ముబారక్ అల్-కబీర్ ప్రాంతాల్లో పలుచోట్ల పవర్ కట్..!!
- కతారా హాస్పిటాలిటీ.. హోటళ్లు, రిసార్టుల్లో 40 శాతం వరకు ఆదా..!!
- దుబాయ్ హోటల్ ధరలకు రెక్కలు..175 శాతం వరకు పెంపు..!!
- ఒమన్ లో స్కూల్ బస్సు డ్రైవర్లకు పోలీసుల కీలక సూచనలు..!!
- బహ్రెయిన్‌లో మత బోధన, కార్యకలాపాలకు కొత్త నిబంధనలు..!!
- ప్రపంచ సుందరిగా జొహైరీ మోలా..
- వాట్సాప్‌లో అదిరిపోయే AI ఫీచర్..!
- సౌదీలో వారం రోజుల్లో 12,363 మంది నివాసితులపై బహిష్కరణ వేటు..!!
- కింగ్ ఫహద్ కాజ్‌వేపై బహ్రెయిన్–సౌదీ ట్యాక్సీలకు అనుమతి..!!







