‘నువ్వు నేర్పించిన నైతిక విలువలతో జీవిస్తున్నా’: సోనూసూద్‌

- July 21, 2024 , by Maagulf
‘నువ్వు నేర్పించిన నైతిక విలువలతో జీవిస్తున్నా’: సోనూసూద్‌

బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ తల్లి సరోజ్‌ సూద్‌ జయంతిని పురస్కరించుకొని … ట్విట్టర్‌లో ఆమె ఫోటోను షేర్‌ చేస్తూ భావోద్వేగపు నోట్‌ రాశారు.” హ్యాపీ బర్త్‌డే అమ్మా. నువ్వు లేని ఈ ప్రపంచం అందంగా లేదు. నువ్వు నేర్పించిన సూత్రాలు, నైతిక విలువలుతో నా జీవితాన్ని కొనసాగిస్తున్నా. నిన్ను చాలా ప్రేమిస్తున్నా అమ్మా. ఒక్కసారి నిన్ను ప్రేమగా హత్తుకుని ఎంతగా మిస్‌ అవుతున్నానో చెప్పాలనుంది. నువ్వు చూపించిన మార్గంలో ఎప్పటికీ నడుస్తూనే ఉంటా. లవ్‌ యూ సో మచ్‌ ” అంటూ పోస్ట్‌ చేశారు.కాగా.. అరుంధతి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సోనూసూద్‌ పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. నటన మాత్రమే కాదు.. తనవంతుగా సమాజసేవలో దూసుకెళుతున్నారు. సోనూసూద్‌ అనే ఛారిటబుల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో తన తల్లి సరోజ్‌ సూద్‌ పేరుతో స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నారు. పేదరికంలో ఉన్న ఎందరో విద్యార్థులకు అండగా నిలుస్తున్నారు. ఇటీవలే కర్నూలు జిల్లాకు చెందిన ఓ విద్యార్థికి సాయం అందించారు. అర్హులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల ద్వారా నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా సోనూసూద్‌ సేవలందిస్తున్నారు.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com