‘యానిమల్’ బ్యూటీ త్రిప్తిని టాలీవుడ్ వదిలేసిందా.?

- July 21, 2024 , by Maagulf
‘యానిమల్’ బ్యూటీ త్రిప్తిని టాలీవుడ్ వదిలేసిందా.?

రణ్‌బీర్ కపూర్, రష్మిక మండన్నా జంటగా తెరకెక్కిన ‘యానిమల్’ సినిమా సెన్సేషనల్ విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించిన త్రిప్తి దిమ్రి ఆ తర్వాత తెగ ట్రెండింగ్ అయ్యింది.
యూత్‌లో క్రేజీ ఇమేజ్ కొట్టేసింది. ఇంతలా ట్రెండింగ్ అయిన త్రిప్తికి టాలీవుడ్ మేకర్లు ఇంకేముంది బోలెడన్ని అవకాశాలిచ్చేస్తున్నారంటూ వేడి వేడిగా ప్రచారాలు, కథనాలు వినిపించాయ్.
కట్ చేస్తే, అలాంటిదేమీ లేదట. త్రిప్తికి టాలీవుడ్‌లో అవకాశాలేం లేవని తెలుస్తోంది. ఆ మధ్య మాస్ రాజా రవితేజ సినిమాలో హీరోయిన్ అంటూ ప్రచారం సాగింది. కానీ, అది కూడా కాదని తేలిపోయింది.
చూస్తుంటే, త్రిప్తి పాపని టాలీవుడ్ వదిలేసినట్లే కనిపిస్తోంది. అయితేనేం బాలీవుడ్‌లో త్రిప్తి హంగామా మామూలుగా లేదు. సూపర్ హిట్ సీక్వెల్స్ అయిన ‘భూల్ భులయ్యా 3’లో ఈ సారి త్రిప్తి హీరోయిన్‌గా ఎంపికైంది.
అలాగే, జాన్వీ కపూర్ డెబ్యూ మూవీ ‘ధడక్’‌కి సీక్వెల్‌గా రూపొందుతోన్న ‘ధడక్ 2’లో త్రిప్తి హీరోయిన్‌గా నటిస్తోంది. వెరీ లేటెస్ట్‌గా ఆనంద్ తివారీ దర్శకత్వంలో వచ్చిన ‘బ్యాడ్ న్యూస్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com