UNESCO సదస్సుని ప్రారంభించిన ప్రధాని మోడీ

- July 22, 2024 , by Maagulf
UNESCO సదస్సుని ప్రారంభించిన ప్రధాని మోడీ

న్యూ ఢిల్లీ: వారసత్వ కట్టడాల పరిరక్షణ ధ్యేయంగా పని చేసే యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ 46వ సెషన్‌ను ఆదివారం నాడిక్కడ భారత్‌ మండపంలో ప్రారంభమైంది.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నెల 31 వరకు జరిగే ఈ సమావేశాలకు భారత్‌ ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి. యునెస్కో డైరెక్టర్‌ జనరల్‌ ఓద్రే అజులై, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో పాటు 150కి పైగా దేశాల నుంచి 2000 మందికి పైగా జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రతినిధులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ హాజరయ్యారు.

ఆంధ్రప్రదేశ్‌లోని పర్యాటక ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి కందుల దుర్గేష్‌ కోరారు.యునెస్కో సందర్భంగా ఢిల్లీకి వచ్చిన ఆయన కేంద్ర పర్యటక శాఖ మంత్రి గజేంద్ర షెకావత్‌తోనూ సమావేశమయ్యారు. రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధికి సహాయం చేయాలని కోరారు. ఈ భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ ఏపి బడ్జెట్‌ సమావేశాల తరువాత మరోసారి కేంద్ర మంత్రితో భేటీ కానున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధికి సమగ్ర కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com