భద్రతా హెచ్చరిక జారీ చేసిన కువైట్ ఫైర్ ఫోర్స్
- July 22, 2024
కువైట్: కువైట్ ఫైర్ ఫోర్స్ (KFF) భద్రతా హెచ్చరికను జారీ చేసింది. ముఖ్యంగా ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉన్నందున పౌరులు మరియు నివాసితులు అగ్ని ప్రమాదాల నివారణ మార్గదర్శకాలను పాటించాలని KFF డైరెక్టర్ బ్రిగేడియర్ మొహమ్మద్ అల్-గరీబ్ కోరారు. అగ్నిమాపక దుప్పట్లు, పొగ మరియు గ్యాస్ డిటెక్టర్లు, అగ్నిమాపక పరికరాలు వంటి అగ్ని నివారణ పరికరాలను కలిగి ఉండటం, ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడం తెలుసుకోవాలన్నారు. ఓవర్‌లోడెడ్ సర్క్యూట్‌ల వల్ల విద్యుత్తు లోపాలు అగ్నిప్రమాదాలకు ప్రధాన కారణమని, అనవసరమైన పరికరాలను చెక్ చేసుకోని తరచూ మార్చుకోవాలని ఆయన సూచించారు. గ్యాస్ స్టవ్‌ల ప్రమాదాల గురించి కూడా అవగాహన పెంచుకోవాలని, అటువంటి ప్రమాదాలను నివారించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అల్-గరీబ్ సూచించారు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







