సౌదీ అరేబియాలో ఫుడ్ ఫ్రాడ్.. ముగ్గురు ప్రవాసులే కారణం..!
- July 22, 2024
రియాద్: ముగ్గురు ప్రవాసులు ఆహార ఉత్పత్తులకు సంబంధించి మోసానికి పాల్పడ్డారని ఆర్థిక నేరాల ప్రాసిక్యూషన్ ఆరోపించింది. ఈ ఉత్పత్తులు గడువు ముగిసినవని, సరిగ్గా నిల్వ చేయనివి అని దర్యాప్తులో వెల్లడైందని పేర్కొంది. నిందితులు 55 టన్నులకు పైగా ఉన్న పౌల్ట్రీని ప్రదర్శించి, నిల్వ చేశారని, వాటిని తప్పుడు లేబుల్‌లతో తిరిగి ప్యాక్ చేసి, ఉత్పత్తి తేదీలలో మార్పులు చేసి విక్రయాలు చేస్తున్నారని ఆరోపించారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని క్రిమినల్ కోర్టుకు తరలించామని తెలిపింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ మానవ ఆరోగ్యానికి హాని కలిగించే నేరపూరిత చర్యలకు పాల్పడే వారిపై కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని, చట్టపరంగా భారీ జరిమానాలను విధించాలని కోరింది.
తాజా వార్తలు
- సౌదీ-మలేషియా జాయింట్ ఆపరేషన్.. డ్రగ్ నెట్వర్క్ బస్ట్..!!
- హవల్లీ, ముబారక్ అల్-కబీర్ ప్రాంతాల్లో పలుచోట్ల పవర్ కట్..!!
- కతారా హాస్పిటాలిటీ.. హోటళ్లు, రిసార్టుల్లో 40 శాతం వరకు ఆదా..!!
- దుబాయ్ హోటల్ ధరలకు రెక్కలు..175 శాతం వరకు పెంపు..!!
- ఒమన్ లో స్కూల్ బస్సు డ్రైవర్లకు పోలీసుల కీలక సూచనలు..!!
- బహ్రెయిన్‌లో మత బోధన, కార్యకలాపాలకు కొత్త నిబంధనలు..!!
- ప్రపంచ సుందరిగా జొహైరీ మోలా..
- వాట్సాప్‌లో అదిరిపోయే AI ఫీచర్..!
- సౌదీలో వారం రోజుల్లో 12,363 మంది నివాసితులపై బహిష్కరణ వేటు..!!
- కింగ్ ఫహద్ కాజ్‌వేపై బహ్రెయిన్–సౌదీ ట్యాక్సీలకు అనుమతి..!!







