అమృత్ కాలానికి చెందిన బడ్జెట్ ఇది : ప్రధాని మోడీ
- July 22, 2024
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం మూడోసారి కొలువుదీరిన తర్వాత తొలిసారి బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. ఇక ఈ సమావేశాల్లో ప్రభుత్వం ఆరు బిల్లులను సభామోదం కోసం తీసుకురానుంది. మరో వైపు నీట్ ప్రశ్నపత్నం లీకేజీ, రైల్వే భద్రత, కావడి యాత్ర మార్గంలో హోటళ్లపై యజమానుల పేర్లు రాయాలనే నిబంధన వంటి అంశాలపై కేంద్రాన్ని నిలదీయాలని విపక్ష ఇండియా కూటమి సభ్యులు సిద్ధమయ్యారు.
కాగా, బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధాని మోడి పార్లమెంటు వద్ద మీడియాతో మాట్లాడారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యం పూర్తి చేస్తామని ప్రధాని పునరుద్ఘాటించారు. సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకెళ్తున్నామని తెలిపారు. తమ ప్రభుత్వం దేశం కోసం పోరాడుతోందని చెప్పారు. ఐదేళ్లు ప్రగతి కోసం పోరాడాలని, తర్వాత వచ్చే ఎన్నికల గురించి ఆలోచించాలని కూటమి నేతలకు మోడీ పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







