ఇండిగో విమానంలో సాంకేతిక లోపం..మస్కట్‌ కు దారి మళ్లింపు..!

- July 22, 2024 , by Maagulf
ఇండిగో విమానంలో సాంకేతిక లోపం..మస్కట్‌ కు దారి మళ్లింపు..!

ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో దారి మళ్లించారు. అబుదాబి  నుంచి ఢిల్లీ కి వస్తున్న విమానంలో టెక్నికల్‌ సమస్య వచ్చింది. దాంతో పైలెట్ ఆ విమానాన్ని మస్కట్‌ కు మళ్లించాడు. మస్కట్‌లో ప్రయాణికులకు బస ఏర్పాటు చేశారు.

అనంతరం ప్రయాణికులు వారి గమ్యాలకు చేరుకునేందుకు ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. విమానం టేకాఫ్‌ అయిన కొంతసేపటి తర్వాత వైబ్రేషన్‌ మొదలయ్యాయని, దాంతో పైలట్‌ సమీపంలోని మస్కట్‌ విమానాశ్రయానికి విమానాన్ని మళ్లించాడని ప్రయాణికులు తెలిపారు. విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్యను సరిచేసిన తర్వాత అది ఢిల్లీకి బయలుదేరుతుందని ఎయిర్‌లైన్స్‌ అధికారులు తెలిపారు.అనంతరం ప్రయాణికులు వారి గమ్యాలకు చేరుకునేందుకు ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. విమానం టేకాఫ్‌ అయిన కొంతసేపటి తర్వాత వైబ్రేషన్‌ మొదలయ్యాయని, దాంతో పైలట్‌ సమీపంలోని మస్కట్‌ విమానాశ్రయానికి విమానాన్ని మళ్లించాడని ప్రయాణికులు తెలిపారు. విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్యను సరిచేసిన తర్వాత అది ఢిల్లీకి బయలుదేరుతుందని ఎయిర్‌లైన్స్‌ అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com