శ్రీలంక చేరుకున్న టీమిండియా
- July 22, 2024
కొలంబో: టీమిండియా ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ తొలిసారిగా విలేకరుల సమావేశాన్ని ముగించుకొని ఇండియాతో శ్రీలంక బయలుదేరారు. సోమవారం (జూలై 22) టీమిండియా ముంబై నుంచి శ్రీలంక పర్యటనకు బయలుదేరింది.తాజాగా భారత ఆటగాళ్లు శ్రీలంక చేరుకున్నారు.
ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తో పాటు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్,హార్దిక్ పాండ్య, రింకూ సింగ్, అర్షదీప్ సింగ్, లంక గడ్డపై అడుగుపెట్టిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
టీ20 జట్టు మాత్రమే శ్రీలంకకు బయలుదేరినట్టు కనిపిస్తుంది. టీ 20 సిరీస్ జూలై 27 నుంచి ప్రారంభమవుతుంది. వన్డే జట్టు త్వరలో లంకకు వెళ్తుంది.మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో భారత్, శ్రీలంక పర్యటన ప్రారంభం కానుంది. సిరీస్‌లో మొదటి టీ20 జూలై 27న ,రెండవ మ్యాచ్ జూలై 28,థర్డ్ మ్యాచ్ 30న జరుగుతాయి.టీ20 సిరీస్ అనంతరం ఆగస్టు 2,4,7 తేదీల్లో వరుసగా మూడు వన్డేలు జరుగునున్నాయి.భారత కాలమానం ప్రకారం, టీ20లు రాత్రి 7:30 గంటలకు, వన్డేలు మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభం కానున్నాయి.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







