240 ఎస్కార్ట్ వెబ్‌సైట్లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది..
- June 14, 2016
వ్యభిచారానికి ఉపయోగిస్తున్న 240 ఎస్కార్ట్ వెబ్‌సైట్లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని నిపుణుల కమిటీ సూచనల మేరకు చర్యలు తీసుకుంది. ఎస్కార్ట్ సేవలు అందిస్తున్న 240 వెబ్‌సైట్లను నిలిపి వేయాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించినట్టు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ అధికారి ఒకరు వెల్లడించారు. దీనిపై ఏవైనా అభ్యంతరాలుంటే నిపుణుల కమిటీకి తెలపాలని సూచించారు.అయితే ప్రభుత్వ చర్యను ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడనర్లు తప్పుబట్టారు. కొన్ని వెబ్ సైట్లపై నిషేధించి విధించినంత మాత్రానా సమస్య పరిష్కారం కాదని అన్నారు. ఈ వెబ్ సైట్లు పేర్లు లేదా లింకులు కొద్దిగా మార్చుకున్నా మళ్లీ వస్తాయని వెల్లడించారు.ఎస్కార్ట్ వెబ్‌సైట్లను నిర్వహించే వారిని కనిపెట్టి సమస్యను పరిష్కరించాలని సూచించారు. దినపత్రికల్లో ఎస్కార్ట్ ప్రకటనలు రాకుండా చూడాలన్నారు. ప్రభుత్వ నిర్ణయం సహేతుకంగా లేదని, మనదేశానికి చెందిన వెబ్ సైట్లను మాత్రమే నిషేధించడం సబబు కాదని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







