ఏపి రాజధాని నిర్మాణం కోసం రూ. 15 వేల కోట్లు: మంత్రి నిర్మల
- July 23, 2024
న్యూఢిల్లీ: లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగాన్ని చదవడం ప్రారంభించారు. కేంద్ర బడ్జెట్-2024లో ఆంధ్రప్రదేశ్‌కు కీలక కేటాయింపులు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 15 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ చెప్పారు. రానున్న ఏళ్లలోనూ సాయం అందుతుందన్నారు. అలాగే, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రైతులు, దేశ ఆహార భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి సహకరిస్తామన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు.. ప్రకాశం జిల్లాకు సాయం ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధికి కేంద్రం నుంచి సహకారం ఉంటుందని చెప్పారరు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీలను అనుసరించి సాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరంలోని మిగతా 8 నెలల కాలానికి బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ ఏడాది ప్రారంభంలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో చెప్పినట్లుగానే పేదలు, మహిళలు, యువత, రైతుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. మధ్యంతర బడ్జెట్లో చెప్పినట్లుగా ఇప్పటికే రైతలు కోసం అన్ని ప్రధాన పంటలకు అధిక కనీస మద్దతు ధరలు ప్రకటించినట్లు ఆమె చెప్పారు. 80 కోట్ల మందికి లబ్ధి కలిగేలా ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజనను అయిదేళ్లు పొడిగిస్తున్నట్లు తెలిపారు. 4.1 కోట్ల యువతకు అయిదేళ్ల కాలంలో 2 లక్షల కోట్ల రూపాయలతో అయిదు పథకాలు తెస్తున్నట్లు చెప్పారు. రైతుల కోసం వచ్చే రెండేళ్లలో అధిక దిగుబడులిచ్చే, వాతావరణ పరిస్థితులను తట్టుకునే 109 కొత్త వంగడాలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. 32 రకాల వ్యవసాయ, ఉద్యాన పంటల్లో ఈ కొత్త వంగడాలను తీసుకొస్తామన్నారు.
తాజా వార్తలు
- సౌదీ-మలేషియా జాయింట్ ఆపరేషన్.. డ్రగ్ నెట్వర్క్ బస్ట్..!!
- హవల్లీ, ముబారక్ అల్-కబీర్ ప్రాంతాల్లో పలుచోట్ల పవర్ కట్..!!
- కతారా హాస్పిటాలిటీ.. హోటళ్లు, రిసార్టుల్లో 40 శాతం వరకు ఆదా..!!
- దుబాయ్ హోటల్ ధరలకు రెక్కలు..175 శాతం వరకు పెంపు..!!
- ఒమన్ లో స్కూల్ బస్సు డ్రైవర్లకు పోలీసుల కీలక సూచనలు..!!
- బహ్రెయిన్‌లో మత బోధన, కార్యకలాపాలకు కొత్త నిబంధనలు..!!
- ప్రపంచ సుందరిగా జొహైరీ మోలా..
- వాట్సాప్‌లో అదిరిపోయే AI ఫీచర్..!
- సౌదీలో వారం రోజుల్లో 12,363 మంది నివాసితులపై బహిష్కరణ వేటు..!!
- కింగ్ ఫహద్ కాజ్‌వేపై బహ్రెయిన్–సౌదీ ట్యాక్సీలకు అనుమతి..!!







