మస్కట్ లో అత్యవసరంగా దిగిన ఇండిగో విమానం
- July 23, 2024
న్యూఢిల్లీ: అబుదాబి నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో ఫ్లైట్ 6E 1406 సాంకేతిక లోపం కారణంగా ఒమన్‌లోని మస్కట్‌కు మళ్లించినట్టు ఇండిగో తెలిపింది. ప్రయాణీకులకు మస్కట్‌లో వసతి కల్పించామని, వారిని గమ్యస్థానానికి చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్టు తెలిపింది.టేకాఫ్ అయిన వెంటనే విమానం కంపించందని, దీంతో విమానాన్ని మళ్లించినట్టు ప్రయాణికులు తెలిపారు.
"ఇండిగో ఫ్లైట్ 6E 1406 అబుదాబి నుండి ఢిల్లీకి బయలుదేరింది. సాంకేతిక సమస్య కారణంగా మస్కట్‌కు మళ్లించాము. అవసరమైన నిర్వహణ తర్వాత విమానం తిరిగి షెడ్యూల్ అవుతుంది. కస్టమర్లకు మస్కట్‌లో హోటల్ వసతి కల్పించాం. ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము. ”అని ఇండిగో ప్రతినిధి వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీ-మలేషియా జాయింట్ ఆపరేషన్.. డ్రగ్ నెట్వర్క్ బస్ట్..!!
- హవల్లీ, ముబారక్ అల్-కబీర్ ప్రాంతాల్లో పలుచోట్ల పవర్ కట్..!!
- కతారా హాస్పిటాలిటీ.. హోటళ్లు, రిసార్టుల్లో 40 శాతం వరకు ఆదా..!!
- దుబాయ్ హోటల్ ధరలకు రెక్కలు..175 శాతం వరకు పెంపు..!!
- ఒమన్ లో స్కూల్ బస్సు డ్రైవర్లకు పోలీసుల కీలక సూచనలు..!!
- బహ్రెయిన్‌లో మత బోధన, కార్యకలాపాలకు కొత్త నిబంధనలు..!!
- ప్రపంచ సుందరిగా జొహైరీ మోలా..
- వాట్సాప్‌లో అదిరిపోయే AI ఫీచర్..!
- సౌదీలో వారం రోజుల్లో 12,363 మంది నివాసితులపై బహిష్కరణ వేటు..!!
- కింగ్ ఫహద్ కాజ్‌వేపై బహ్రెయిన్–సౌదీ ట్యాక్సీలకు అనుమతి..!!







