పోలీసు స్టేషన్లు, కార్యాలయాల్లో ఏర్పాటు చేయనున్న QR కోడ్ పోస్టర్లను ఆవిష్కరించిన కమిషనర్
- July 23, 2024
హైదరాబాద్: రాచకొండ పోలీస్ కమిషనరేట్ సామాజిక మాధ్యమాల అకౌంట్ల గురించి ప్రజల్లో అవగాహన పెంచేందుకు,వాటిని అందరికీ చేరువ చేసేందుకు సీపీ సుధీర్ బాబు క్యూఆర్ కోడ్ పోస్టర్లను నేరేడ్మెట్ లోని రాచకొండ కార్యాలయంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ..రాచకొండ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ చర్యలలో భాగంగా, రాచకొండ పోలీస్ "ఫేస్ బుక్" "ఎక్స్" "ఇన్స్టాగ్రామ్" వంటి సామాజిక మాధ్యమాల అకౌంట్లు మరియు యూట్యూబ్ ఛానల్ నిర్వహించడం జరుగుతోందని పేర్కొన్నారు.ప్రతీ పోలీస్ స్టేషన్ ఆవరణలో, రిసెప్షన్ లో రాచకొండ పోలీస్ *క్యూఆర్ కోడ్* కలిగిన పోస్టర్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రజలంతా ఈ క్యూఆర్ కోడ్ ను ఉపయోగించుకుని, తమ మొబైల్ ఫోన్లలో స్కాన్ చేయడం ద్వారా సంబంధిత రాచకొండ కమిషనరేట్ సోషల్ మీడియా అకౌంట్లకు సులభంగా చేరుకుని సబ్ స్క్రైబ్ చేసుకోవచ్చని, ఫాలో కావచ్చని తెలిపారు. కాలానికి అనుగుణంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు, వారికి మెరుగైన సత్వర సేవలు అందించేందుకు, వారితో ప్రత్యక్ష సంబంధాలు పెంపొందించుకోవడానికి ఈ సోషల్ మీడియా అకౌంట్లు దోహదం చేస్తాయని సీపీ పేర్కొన్నారు. ప్రజల్లో రాచకొండ కమిషనరేట్ సోషల్ మీడియా అకౌంట్ల గురించి మరింత ప్రచారం కల్పిస్తామని, ప్రతీ ఒక్కరూ వాటిని ఫాలో కావాలని సూచించారు.
వీటి ద్వారా ఎప్పటికప్పుడు డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్ధాల గురించి పలు అవగాహన కార్యక్రమాల నిర్వహణ, సైబర్ నేరాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయడం, భారీ వర్షాలు, వరదలు, అగ్ని ప్రమాదాలు మరియు ఇతర సందర్భాల్లో విపత్తు నిర్వహణ సమాచారం అందించడం జరుగుతుంది అని తెలిపారు.అత్యవసర పరిస్థితుల్లో రాచకొండ వాట్సాప్ కంట్రోల్ నంబర్ 8712662111 ద్వారా కూడా బాధితులు ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో డీసీపీ యాదాద్రి రాజేష్ చంద్ర,డీసీపీ ఎల్.బి నగర్ ప్రవీణ్ కుమార్, డీసీపీ ఎస్బి కరుణాకర్,డీసీపీ క్రైం అరవింద్ బాబు, డీసీపీ మహేశ్వరం సునీత రెడ్ది, డీసీపీ ఉమెన్ సేఫ్టీ ఉషా విశ్వనాథ్,ఐటి సెల్ ఏసిపి నరేందర్ గౌడ్, ఇన్స్పెక్టర్ లు సుధాకర్, గట్టు మల్లు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో తాజ్ హోటల్, బాంబే బ్రాసరీ..!!
- బిగ్ టికెట్ లైవ్ డ్రా.. భారత ప్రవాసికి Dh25 మిలియన్ల జాక్‌పాట్..!!
- కువైట్ ఆరోగ్య వ్యవస్థ బలోపేతంలో నర్సుల పాత్ర కీలకం..!!
- దేశ భద్రతకు ముప్పు కలిగిస్తే గట్టిగా బదులిస్తాం..!!
- ఖతార్‌కు తొలి 10 నెలల్లో పోటెత్తిన పర్యాటకులు..!!
- ఒమన్‌లో ఎస్ఎంఈల అభివృద్ధికి మరో ముందడుగు..!!
- దుబాయ్ పార్క్స్ అండ్ రిసార్ట్స్‌లో దీపావళి వేడుకలు..
- దుబాయ్‌లో ప్రపంచంలోనే తొలి సిటీ వైడ్ టూరిజం లాయల్టీ ప్రోగ్రామ్ ప్రారంభం
- చంద్రబాబు టీమ్‌కు కంగ్రాట్స్..జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- భారత్‌లో 1500% పెరిగిన బంగారం అక్రమ రవాణా!







