ఆసియా క‌ప్‌: నేపాల్‌ పై భారత్ ఘన విజయం...

- July 23, 2024 , by Maagulf
ఆసియా క‌ప్‌: నేపాల్‌ పై భారత్ ఘన విజయం...

శ్రీలంక: ఆసియా క‌ప్‌లో భాగంగా నేడు జరిగిన మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో నేపాల్ జట్టును చిత్తుగా ఓడించి ఆఫీషియల్‌గా సెమీస్‌కు గ్రూప్ ఏ నుంచి సెమీ ఫైనల్స్ కు చేరింది. కాగా, ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు 178 పరుగులు బాదింది. అనంతరం భారీ టార్గెట్‌తో చేజింగ్ ప్రారంభించిన నేపాల్ జట్టును 100 పరుగుల లోపుకే పరిమితం చేసింది.

ముందుగా బ్యాట్‌తో దంచికొట్టిన భారత్.. బంతితోనూ చెలరేగడంతో…. 179 పరుగుల భారీ ఛేదనలో నేపాల్ మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 96 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత మహిళల జట్టు 82 పరుగుల తేడాతో విజయం సాధించింది. నేపాల్ బ్యాటర్లలో సీతా రాణా మగర్ (18), బిందు రావల్ (17 నాటౌట్) హైస్కోరర్లుగా నిలిచారు.

ఇక, అంతకముంద బ్యాటింగ్ చేసిన షెఫాలీ వర్మ (81; 48 బంతుల్లో, 12 ఫోర్లు, 1 సిక్సర్) విధ్వంసం సృష్టించింది. హేమలత (47; 42 బంతుల్లో, 5 ఫోర్లు, 1 సిక్సర్) రాణించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com