తిరుమల లడ్డూలకు నాసిరకం నెయ్యి సప్లై…రెండు కంపెనీలకు నోటీసులు
- July 23, 2024
తిరుమల: తిరుమల గోకులం విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో టీటీడీ ఈవో జే.శ్యామలరావు మంగళవారం (జూలై 23) శ్యామలరావు మీడియాతో మాట్లాడారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు మరింత నాణ్యంగా, రుచికరంగా అందించాలనే లక్ష్యంతో ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నామని….. ఈ చర్యల వలన లడ్డూ ప్రసాదాల రుచి, నాణ్యత పెరిగిందని చెప్పారు.
అదేవిధంగా తక్కువ నాణ్యత గల నెయ్యిని సరఫరా చేస్తున్న సరఫరాదారులు నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఈవో హెచ్చరించారు. కాగా, ప్రస్తుత సప్లయర్స్ ను పిలిచి క్వాలిటీ నెయ్యి సరపరా చేయాలని సూచించినట్టు తెలిపారు. కొన్ని సంస్థలు హై క్వాలిటీ నెయ్యి పంపిస్తుండగా.. మరికొన్ని సంస్థలు నాసిరకం నెయ్యి అందిస్తున్నాయిని పేర్కొన్నారు.
టెండర్ నిబంధనలను ఉల్లంఘించి ఓ అడల్ట్రేట్ నెయ్యి ఇస్తున్నట్లు, వెటిటబుల్ ఫ్యాట్ కలుపుతున్నట్లు తేలిందని ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టామని.. మరో కంపెనీపై చర్యలు తీసుకుంటామని అన్నారు. రెండు కంపెనీలకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసినట్లు ఆయన వివరించారు.
ఇక, ప్రస్తుతానికి అడల్ట్రేషన్ టెస్ట్ చేసే పరికరం టీటీడీ వద్ద లేదని, త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ముడి సరుకులు, నెయ్యి ప్రొక్యూర్మెంట్ సిస్టంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు. నాణ్యమైన నెయ్యి కొనుగోలుకు సంబంధించి నలుగురు ప్రముఖ డైరీ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఇందులో ఎన్‌డీఆర్ఏ విశ్రాంత ఆచార్యులు డా.సురేంద్రనాథ్, హైదరాబాద్ కు చెందిన డా.విజయ భాస్కర్ రెడ్డి, ప్రొఫెసర్ స్వర్ణలత, బెంగళూరుకు చెందిన డాక్టర్ మహదేవన్ ఉన్నారని అన్నారు. ఈ కమిటీ వారం రోజుల్లో నివేదిక అందిస్తారని తెలిపారు. క్వాలిటీ నెయ్యి కోసం టెండర్ లో ఎలాంటి అంశాలు చేర్చాలని ఈ కమిటీ దిశా నిర్దేశం చేస్తుందని అన్నారు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







