ప్రభాస్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా డైరెక్టర్ మారుతి కూతురు
- July 24, 2024
హైదరాబాద్: యూత్ ని టార్గెట్ చేసి చిన్న చిన్న సినిమాలతో హిట్స్ కొట్టిన డైరెక్టర్ మారుతి ఆ తర్వాత స్టార్ హీరోలతో కామెడీ సినిమాలు తీసి మెప్పించారు. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో రాజా సాబ్ సినిమా చేస్తున్నారు. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న రాజాసాబ్ కోసం అభిమానులంతా ఎదురుచూస్తున్నారు.
డైరెక్టర్ మారుతికి ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. ఈ ఇద్దరూ కూడా సినిమా రంగం వైపు వస్తున్నారు. మారుతి ఇటీవల జామ్ జంక్షన్ అనే ఓ మ్యూజిక్ బ్యాండ్స్ కి సంబంధించిన కాంపిటేషన్ ప్రోగ్రాం చేయబోతున్నారు. ఆరు మ్యూజిక్ బ్యాండ్స్ తో సెప్టెంబర్ 6న ఓ కాంపిటేషన్ ప్రోగ్రాం చేయబోతున్నారు. అయితే ఈ ప్రోగ్రాంని మారుతి కూతురు హియ దగ్గరుండి చూసుకుంటుంది.
తాజాగా ఈ జామ్ జంక్షన్ ప్రోగ్రాంకి సంబంధించిన ఈవెంట్ జరగ్గా డైరెక్టర్ మారుతి కూతురు హియ కూడా ఈవెంట్ కి వచ్చారు. దీంతో హియ పలు మీడియా సంస్థలతో ముచ్చటించింది. హియ మాట్లాడుతూ.. నేను చిన్నప్పట్నుంచి క్రియేటివ్ సైడ్ ఎక్కువ ఆలోచించేదాన్ని. నాన్న వర్క్స్ లో కూడా హెల్ప్ చేసేదాన్ని. ఇంటర్ అయిపొయింది. త్వరలో అబ్రాడ్ కి వెళ్లి చదువుతాను. ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాను. సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కి పని చేస్తున్నాను. నాకు నాగ్ అశ్విన్ వర్క్ అంటే ఇష్టం.ఎప్పటికైనా నాగ్ అశ్విన్ తో కలిసి పనిచేయాలి.మా తమ్ముడు మ్యూజిక్ వైపు వెళ్తున్నాడు.ప్రస్తుతం డ్రమ్మర్స్, పియానో ప్లే చేస్తున్నాడు అని తెలిపింది.దీంతో మారుతి కూతురు అప్పుడే అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తుందా, కూతుర్ని కూడా సినిమాల్లోకి తీసుకొస్తున్నాడు అని ఆశ్చర్యపోతూ మారుతిని అభినందిస్తున్నారు.
తాజా వార్తలు
- న్యాయ వ్యవస్థలో ఓ దురదృష్టకరమైన ట్రెండ్ నడుస్తోంది: చీఫ్ జస్టిస్ సూర్యకాంత్
- కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్లు ఇక టెక్ట్స్లో!
- వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా
- ఖతార్ అర్దాలో ఆకట్టుకున్న అమీర్..!!
- భారత్-సౌదీ మధ్య పరస్పర వీసా మినహాయింపు..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్లతో బీభత్సం..!!
- ముబారక్ అల్-కబీర్లో వాహనాలు స్వాధీనం..!!
- ఫ్రెండ్ షిప్ కథను తెలిపే ఇండియన్ మానుమెంట్..!!
- ఖతార్ జాతీయ దినోత్సవం.. షురా కౌన్సిల్ చైర్మన్ అభినందనలు..!!
- హైదరాబాద్: మూడు కమిషనరేట్ల పోలీసుల సంయుక్త వ్యూహం







