టీటీడీ ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల

- July 24, 2024 , by Maagulf
టీటీడీ ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇవాళ రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల చేశారు.అక్టోబరు నెల‌కు సంబంధించిన ఈ ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఇవాళ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేశారు.అలాగే, తిరుమల, తిరుపతిలో అక్టోబరు నెల గదుల కోటాను ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

జూలై 27న శ్రీవారి సేవ కోటా విడుదలవుతుంది. అదే రోజున న‌వ‌నీత సేవ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు, ప‌ర‌కామ‌ణి సేవ మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. http://ttdevasthanams.ap.gov.inవెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని అధికారులు కోరారు. ప్రతి నెల స్వామివారి ఆర్జిత సేవలు, దర్శనాలతో పాటు వసతి గదుల ఆన్‌లైన్ కోటాను విడుదల చేస్తారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com