ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది – జగన్
- July 24, 2024
ఏపీలో జరుగుతున్న దాడులకు నిరసనగా ఢిల్లీ లో ఏపీ మాజీ సీఎం , వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ధర్నా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కూటమి సర్కార్ ఫై తీవ్రస్థాయి లో మండిపడ్డారు. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేసారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని , దాడులు..దైర్జన్యాలతో పాలన సాగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదని, లోకేష్ రెడ్ బుక్ పెట్టుకొని తనకు నచ్చని వారి పైన కక్ష సాధిస్తున్నారని జగన్ వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో రెడ్ బుక్ హోర్డింగ్ లు ఏర్పాటు చేసారన్నారు. రెండ్ బుక్ లో పేర్లు ఉన్నాయంటూ రాజకీయ నేతలు, అధికారులను వేధిస్తున్నారన్నారు. బాధితుల పైనే పోలీసులు కేసులు పెడుతున్నారని చెప్పుకొచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత 30 మందికి పైగా వైసీపీ కార్యకర్తల హత్య జరిగిందని చెప్పుకొచ్చారు. తాము అధికారంలో ఉన్న సమయంలో ఈ విధంగా దాడులను ప్రోత్సహించలేదని జగన్ వివరించారు. ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అనే సందేహం కలుగుతోందన్నారు. ఏపీలో పరిస్థితులు వివరించేందుకు రాష్ట్రపతి, ప్రధాని అప్పాయింట్ మెంట్ కోరామన్నారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ 2025 సాల్ట్ లేక్ సిటీ నిధుల సేకరణ కార్యక్రమం ఘనవిజయం
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- 2025లో యూఏఈ వీసా నియమాల్లో కీలక మార్పులు..!!
- కువైట్ లో పలు మీట్ షాప్స్ సీజ్..!!
- రసాయన ఆయుధాల నిషేధంపై కమిటీ ఏర్పాటు..!!
- టాక్సీ యజమానులకు జరిమానా మినహాయింపు..!!







