భారీగా పతనమైన బంగారం ధర
- July 24, 2024
బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికీ గుడ్ న్యూస్. మంగళవారం లోక్ సభ లో ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో బంగారం , వెండిపై కస్టమ్స్ డ్యూటీని తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. గోల్డ్, సిల్వర్‌పై 15 శాతంగా ఉన్న కస్టమ్స్ డ్యూటీని ఏకంగా 6 శాతానికి తగ్గించారు. ప్లాటినంపై కస్టమ్స్ డ్యూటీ 6.4 శాతంగా ప్రకటించారు. దీంతో ఈరోజు మార్కెట్ లో బంగారం ధర భారీగా పతనమైంది. ఒక్కసారిగా 10 గ్రాములపై రూ. 4 వేల వరకు ధర పతనం కావడంతో బంగారం కొనుగోలు చేయడానికి ఉత్సాహం ప్రదర్శించారు. 24 క్యారెట్ 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 70,086కు చేరుకోగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66,495 కు తాకింది. కిలో వెండి ధర రూ. 88 వేలుకు చేరుకుంది. బంగారం ధరలు గత వారం చూసిన వారి ఆల్‌టైమ్ గరిష్టాల దగ్గరకు వెళ్లాయి. ఇక బడ్జెట్‌కు 6 రోజుల ముందు బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి.
ఇటు దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నిన్న పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో మార్కెట్లు కుప్పకూలిన విషయం తెలిసింది. ఇవాళ ఉదయం సైతం మార్కెట్‌లు ఫ్లాట్‌గా మొదలయ్యాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే 80,343.38 పాయింట్ల వద్ద ఫ్లాట్‌గా మొదలైంది. అదే సమయంలో నిఫ్టీ సైతం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నది. ప్రారంభ ట్రేడింగ్ సెషన్‌లో ఐటీసీ 2శాతం పెరగ్గా.. బజాజ్ ఫైనాన్స్ షేర్లు 2శాతం బలహీనపడ్డాయి. ప్రస్తుత సెన్సెక్స్ 121 పాయింట్ల నష్టంతో 80,307 వద్ద కొనసాగుతున్నది. నిఫ్టీ 35.2 పాయింట్లు పతనమై.. 24,443.2 వద్ద ట్రేడవుతున్నది.
తాజా వార్తలు
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- 2025లో యూఏఈ వీసా నియమాల్లో కీలక మార్పులు..!!
- కువైట్ లో పలు మీట్ షాప్స్ సీజ్..!!
- రసాయన ఆయుధాల నిషేధంపై కమిటీ ఏర్పాటు..!!
- టాక్సీ యజమానులకు జరిమానా మినహాయింపు..!!
- గూగుల్ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2..







