తేజ్ మ్యారేజ్.! తూచ్ అంతా వుత్తదే.! తేల్చేసిన టీమ్.!
- July 24, 2024
గత కొన్ని రోజులుగా మెగా ఫ్యామిలీలో పెళ్లి బాజాలు మోగబోతున్నాయంటూ ఓ ప్రచారం చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అది మరెవరిదో కాదు, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌ది అని చెవులు కొరుక్కుంటున్నారు.
పెళ్లి కూతురు విషయంలోనూ పలు ప్రచారాలు.. నిన్న మొన్నటి వరకూ నిహారికతోనే తేజు పెళ్లని ప్రచారం జరిగింది. ఇప్పుడేమో హీరోయిన్ మెహ్రీన్‌కి లింక్ కలిపేసి వేడి వేడిగా కథనాలు వండి వడ్డించేస్తున్నారు.
‘జవాన్’ సినిమాలో మెహ్రీన్‌తో కలిసి నటించాడు తేజు. ఆ సినిమా నుంచీ వీరిద్దరి మధ్యా ప్రేమ వుందని పుకార్లు పుట్టిస్తున్నారు. నిజానికి మెహ్రీన్‌కి ఆ మధ్య ఓ బిజినెస్ మ్యాన్‌తో ఎంగేజ్మెంట్ అయ్యింది. కానీ, ఎంగేజ్మెంట్ దగ్గరే ఆ పెళ్లి ఆగిపోయింది.
తాజాగా తేజుతో పెళ్లి వార్తలపై తేజ్ పర్సనల్ టీమ్ రెస్పాండ్ అయ్యింది. తూచ్.! అదంతా వుత్తదే.. అలాంటిదేమైనా వుంటే, ఆనందంగా అధికారికంగా అనౌన్స్ చేస్తాం.. కానీ, ఇలాంటి అబద్ధపు వార్తలు ప్రచారం చేయొద్దని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.
ప్రస్తుతం తేజ్ ఓ ప్యాన్ ఇండియా ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో నటిస్తున్నాడు. ‘హనుమాన్’ నిర్మాత నిరంజన్ రెడ్డి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. దాదాపు 120 కోట్ల భారీ బడ్జెట్ అని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- గూగుల్ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2..
- ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కర్టెన్ రైజర్ ఆవిష్కరణ
- టిటిడి డైరీలు, క్యాలండర్లకు అనూహ్యస్పందన
- బహ్రెయిన్‌లో ‘అఖండ–2’ ఉచిత ప్రీమియర్ బెనిఫిట్ షో
- ఘనంగా సుల్తాన్ సాయుధ దళాల వార్షిక దినోత్సవం..!!
- యునెస్కో వారసత్వ జాబితాలో దీపావళి..!!
- కువైట్ మునిసిపాలిటీ స్పెషల్ ఆపరేషన్.. 19 వాహనాలు సీజ్..!!
- ఖతార్ పీఎంతో యూఎన్ఓ సెక్రటరీ జనరల్ చర్చలు..!!
- యూఏఈలో జనవరి 1న పెయిడ్ హాలీడే..!!
- జెడ్డా బుక్ ఫెయిర్ 2025లో ప్రసిద్ధ సినిమాల షో..!!







