రమదాన్ నైట్ మార్కెట్ కు అరగంటలో 1000 మంది సందర్శకులు!
- July 04, 2015
ఈ గురువారం సాయంత్రం తెరువబడిన రమదాన్ నైట్ మార్కెట్ సందర్శకులతో కిటకిటలాడింది. పిల్లలను, పెద్దలను ఒకేవిధంగా ఆకర్షించే 300 రీటేల్ ఔట్‌లెట్లను కలిగిఉన్నదీనిని, కేవలం మొదటి అరగంట సమయంలో 1000 మంది వినియోగదారులు ముంచెత్తారు! మిర్రర్ మాన్, లివింగ్ స్ట్యాట్యూ, హాండ్ రైటింగ్ అనాలిసిస్ వంటి అనేక రకాల ఆకర్షణలతో, ఆడవారి కోసం హెన్నా మజ్లిస్ వంటివి, చిన్నారుల కోసం మెర్రీ లాటర్ అండ్ మూజిక్ చక్కని అటవిడుపులే కాకుండా, చవులూరించే 50 ఫుడ్ ఔట్‌లెట్లు కూడా రాత్రంతా సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. జువెల్లరీ, గార్మెంట్స్, కాస్మెటిక్స్, ఫర్నిచర్ వంటి షాపింగ్ ఆవన్యూ లలో అతి విస్తారమైన శ్రేణితో అలరిస్తూ సందర్శకుల బేరాలతో ప్రతిధ్వనిస్తోంది. ఇక్కడ కేవలం షాపింగ్ మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు వినోదాన్నందించడం ఈ పండుగ ప్రత్యేకత అని సుమనస ఎగ్జిబిషన్ ప్రెసిడెంట్ - సునీల్ జైశ్వాల్ విశ్లేషించారు. అంతే కాకుండా ఇక్కడ రీ సైకిల్ ఫర్నిచర్ మార్కెట్ లో, 100% రీ సైకిల్ చేయబడిన పేపర్ తో 20 cm నుండి 40 mt వరకు వ్యాప్తించే ల క్షణం గల పేపర్ ఫర్నిచర్, ఒక టన్ను వరకు బరువును తట్టుకోగలుగుతుంది; 6 నుండి 8 మంది కూర్చునేవిధంగా అనువుగా ఉంటుంది.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







