సినిమా రివ్యూ: రాయన్.!

- July 26, 2024 , by Maagulf
సినిమా రివ్యూ: రాయన్.!

తమిళ స్టార్ హీరోల్లో ఒకరైన ధనుష్ ఇటీవల తెలుగులో డైరెక్ట్ మార్కెట్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ‘సర్’ సినిమాతో ఆ అవకాశం దక్కించుకున్నాడు ధనుష్. అంతకు ముందే తన డబ్బింగ్ సినిమాలకూ తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది.

ఇక ఇప్పుడు ఆయన స్వీయ దర్శకత్వంలో ‘రాయన్’ అనే సినిమాని తెరకెక్కించాడు. ఇది ధనుష్‌కి 50 వ సినిమా కావడం విశేషం. ధనుష్ సొంత కథ, టేకింగ్‌‌లో వచ్చిన ఈ సినిమాలో ఎస్.జె.సూర్య, సందీప్ కిషన్, వరలక్ష్మీ శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, అపర్ణ బాలమురళి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి, ప్రేక్షకుల అంచనాల్ని ‘రాయన్’ అందుకున్నాడా.? లేదా.? తెలియాలంటే కథలోకి వెళ్సాల్సిందే.

కథ:
చిన్నప్పుడు జరిగిన ఓ విషాదాంతమైన ఇన్సిడెంట్‌తో తన ఇద్దరు తమ్ముళ్లు ముత్తు రాయన్ (సందీప్ కిషన్), మాణిక్య రాయన్ (కాళిదాసు జైరాం) అలాగే చెల్లెలు దుర్గ (దుషారా)తో కలిసి చెన్నైలోని అంజనా పురానికి వస్తాడు కార్తవ రాయన్ (ధనుష్). అక్కడ శేఖర్ (సెల్వ రాఘవన్) అనే వ్యక్తి వీళ్లని చేరదీస్తాడు. అయినా తాను కష్టపడి తెచ్చిన సొమ్ముతోనే తన తమ్ముళ్లు, చెల్లెలిని జాగ్రత్తగా సాకుతుంటాడు రాయన్. చెల్లెలంటే రాయన్‌కి ప్రాణం. ఆమె కోసం ఎంత దూరమైనా వెళతాడు. అదే క్రమంలో ఆ ప్రాంతంలో ఇద్దరు లోకల్ డాన్‌లైన సేతు రామన్ (ఎస్.జె.సూర్య), దురై (శరవణన్) మధ్య పవర్ వార్ జరుగుతూ వుంటుంది. ఈ ఇద్దరు పవర్ ఫుల్ డాన్‌లతో రాయన్ ఎందుకు గొడవ పడాల్సి వచ్చింది. వారితో పవర్ వార్‌లో దూరి రాయన్ తనదే పై చేయిగా ఎదగాల్సిన క్రమంలో తన తమ్ముళ్లే తనకు ఎదురు తిరగాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది.? ఈ ప్రాంతంలోని క్రైమ్‌ని ఆపడానికి వచ్చిన పోలీసాఫీసర్ ప్రకాష్ రాజ్‌కి ఎదురైన అనుభవాలేంటీ.? చివరికి ఈ నాయకత్వ పోరు ఎలా ముగిసింది.? తెలియాలంటే ‘రాయన్’ ధియేటర్లలో చూడాల్సిందే.

నటీనటుల పనితీరు:
ధనుష్ పర్‌ఫామెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పడానికేముంది. అయితే, ఈ సినిమా కోసం డిఫరెంట్ రా లుక్ ట్రై చేశాడు ధనుష్. గుండుతో డీ గ్లామర్ రోల్‌లో కనిపించి ఇంటెన్స్ పర్‌ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఎస్.జె.సూర్య మెయిన్ విలన్ రోల్ పోషించాడు. ఎప్పటిలాగే తన పాత్రకు న్యాయం చేశాడు. ధనుష్‌కి అప్పోజిట్ రోల్‌లో బలమైన పోటీ ఇచ్చాడు. ధనుష్‌కి తమ్ముడిగా కీలక పాత్ర పోషించిన సందీప్ కిషన్ తన పాత్రకు తగ్గ న్యాయం చేశాడు.  ఎప్పటిలాగే నేచురల్ పర్‌ఫామెన్స్ ఇచ్చాడు. అలాగే మరో తమ్ముడి పాత్ర పోషించిన కాళిదాస్ జైరామ్ డీసెంట్ లుక్స్‌తో ఆకట్టుకున్నాడు. చెల్లెలి పాత్ర పోషించిన దుషారా ఈ సినిమాకి మరో సర్‌ప్రైజింగ్ ప్యాకేజ్. పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రకాష్ రాజ్ తనదైన అనుభవం కలిగిన పాత్రలో కనిపించి మెప్పించాడు. వరలక్ష్మి శరత్ కుమార్, అపర్ణ బాలమురళి, తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.

సాంకేతిక వర్గం పనితీరు:
ఇంతవరకూ నటుడిగానే నెక్స్‌ట్‌ లెవల్ పర్‌ఫామెన్స్ చూశాం ధనుష్ నుంచి. ఇప్పుడు డైరెక్టర్‌గానూ తన టేకింగ్ సూపర్బ్ అనిపించేలా చేశాడు. పాత కథే అయినా, తన మేకింగ్‌లో కొత్తదనం చూపించి వావ్ అనిపించాడు. స్లోగా స్టార్ట్ చేసి ఫస్టాఫ్ రెగ్యులర్ ఫార్మేట్‌లో నడిపించినా సెకండాఫ్‌ ఆశక్తి పెంచేశాడు. ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చే ట్విస్టులతో కథలో ఆసక్తిని అంతకంతకూ పెంచేశాడు. యాక్షన్ ఎపిసోడ్స్.. అందుకు తగ్గట్లుగా రెహమాన్ కొట్టి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ స్క్రీన్స్ దద్దరిలిపోయేలా చేశాయ్. నిజంగా చెప్పాలంటే మ్యూజిక్ ఈ సినిమాకి సెకండ్ హీరో అనేంతలా రెహమాన్ బిజీఎమ్‌తో ఆకట్టుకున్నాడు చాలా కాలం తర్వాత. సినిమాటోగ్రఫీ కథకు తగ్గట్లుగా వుంది. ఎడిటింగ్ విషయానికి వస్తే, ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లు కాస్త సాగతీతలా అనిపిస్తాయంతే. నిర్మాణ విలువలు బాగున్నాయ్.

ప్లస్ పాయింట్స్:
ధనుష్ పర్‌ఫామెన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, నటీనటుల ఎంపిక, సెకండాఫ్‌లో ఊహించని ట్విస్టులు, ఇంకా ఎస్.జె సూర్య, ధనుష్ మధ్య వచ్చే సన్నివేశాలు, యాక్షన్ సీన్లు.. బోర్ కొట్టించకుండా పాత కథనే చాలా చాకచక్యంగా, వైజ్ స్క్రీన్‌ప్లేతో తొలి డైరెక్షన్‌లోనే అందించిన ధనుష్ టాలెంట్.

మైనస్ పాయింట్స్:
రొటీన్‌గా సాగిన ఫస్టాఫ్, అక్కడక్కడా సాగతీత అనిపించిన కొన్ని సన్నివేశాలు అది కూడా ఫస్టాఫ్‌లోనే..అలాగే వీక్ స్టోరీ లైన్

చివరిగా:
ధనుష్ టేకింగ్‌లో ‘రాయన్’ ఓ డిఫరెంట్ యాక్షన్ పవర్ వార్.! 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com