అబ్బాసియాలో విషాదం.. భారతీయ విద్యార్థి మృతి..!!
- March 10, 2026
కువైట్: అబ్బాసియాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో వాహనం ఢీకొనడంతో ఒక భారతీయ విద్యార్థి మరణించాడు.
మృతుడిని జలీబ్‌లోని యునైటెడ్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ప్లస్ టూ చదివే విద్యార్థి, తమిళనాడుకు చెందిన జోయెల్ మెవిన్ మైఖేల్‌గా గుర్తించారు. ట్యూషన్ నుండి ఇంటికి తిరిగి వస్తుండగా వాహనం ఢీకొని మరణించాడని పోలీసులు తెలిపారు.
ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, సమీపంలోని రోడ్డుపై ఉన్న వాహనం మరొక వాహనాన్ని ఢీకొట్టి, ఆ తరువాత విద్యార్థినిపైకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. కొంతమంది యువకులు ఆ ప్రాంతంలో వాహనాలు నడుపుతున్నారని, దీనివల్ల ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ప్రమాద తీవ్రతకు జోయెల్ అక్కడికక్కడే మరణించాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- తాను చదువుకున్న పాఠశాలకు మిస్ యూనివర్స్ కాజియా పునరాగమనం
- అక్టోబర్ 1 నుంచి యూఏఈ పుస్తక దుకాణాల్లో షేక్ మహమ్మద్ బిన్ రషీద్ ‘ది లెటర్స్’
- NATS ఆధ్వర్యంలో దిగ్విజయంగా ‘అడాప్ట్ ఎ పార్క్' కార్యక్రమం
- ఎతిహాద్ రైల్ దుబాయ్ స్టేషన్ ప్రారంభం..సెప్టెంబర్ 30 నుంచి ప్రయాణికుల సేవలు
- భారత్–షార్జా వాణిజ్య, పెట్టుబడుల సహకారంపై చర్చలు
- విశాఖ మెట్రోకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- రూ.20కే రెండు లక్షల ప్రమాద బీమా
- భారత్–యూఏఈ పెట్టుబడుల భాగస్వామ్యంపై కీలక చర్చలు
- తెలంగాణా రాష్ట్రంలో తెలుగుభాషా దినోత్సవం
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ఇద్దరి అరెస్ట్..!!







