ఇంజినీరింగ్ విద్యార్థులకు శుభవార్త
- July 26, 2024
హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజినీరింగ్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్తగా మరో 9 వేల ఇంజినీరింగ్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. శుక్రవారం నుంచి రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభమైంది. 27,28వ తేదీల్లో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఉంటుంది. ఈ నేపథ్యంలో నేడు ఉదయం వరకు కొత్త సీట్లకు రాష్ట్ర విద్యాశాఖ పర్మిషన్ ఇవ్వనుంది. డిమాండ్ లేని బ్రాంచీల స్థానంలో సీఎస్ఈ తదితర బ్రాంచీల నుంచి 7 వేల సీట్లు, అదనపు సీట్లతో కలిపి కొత్తగా 20,500 సీట్లు అందుబాటులోకి రావాలి. ఇందుకు ఏఐసీటీఈ కూడా ఆమోదం తెలిపింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడత కౌన్సెలింగ్‌లో 2,600 సీట్లకు పర్మిషన్ ఇచ్చింది. తాజాగా రెండో విడతకు సుమారు 9 వేల సీట్లు మంజూరు చేస్తున్నది. వీటికి సంబంధించి విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం కసరత్తు పూర్తి చేశారు. ఇక తొలివిడత కౌన్సెలింగ్‌లో మొత్తం 75,200 మందికి బీటెక్ సీట్లు వచ్చాయి. వీళ్లు ట్యూషన్ ఫీజు చెల్లించి ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసే గడువు ఈ నెల 23వ తేదీతో ముగిసింది. ఈ గడువులో దాదాపు 55 వేలమంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు. మిగతా 20 వేల మంది సీట్లు వదులుకున్నారు. అయితే వీళ్లలో చాలామంది మేనేజ్మెంట్ కోటాలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







