ఇరకాటంలో ‘తండేల్’ రిలీజ్.!

- July 27, 2024 , by Maagulf
ఇరకాటంలో ‘తండేల్’ రిలీజ్.!

నాగ చైతన్య హీరోగా వస్తున్న తాజా మూవీ ‘తండేల్’. సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయ్. చందూ మొండేటి టేకింగ్‌పైనా భారీ ఎక్స్‌పెక్టేషన్సే వున్నాయ్. అయితే, ఈ సినిమాని డిశంబర్‌లో రిలీజ్ చేసేందుకు మేకర్లు నిర్ణయించుకున్నారు.

ఆ క్రమంలో అధికారికంగా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేశారు ఎప్పుడో. కానీ, డిశంబర్‌లో ‘తండేల్’ రిలీజ్ కానుంది. అయితే, అది అప్పుడు. ఇప్పుడు ఈక్వేషన్స్ మారిపోయాయ్.

డిశంబర్‌లో అనుకోకుండా ‘గేమ్ ఛేంజర్’ వంటి పెద్ద సినిమాలు రిలీజ్‌కి సిద్ధమవుతున్నాయ్. అలాగే అల్లు అర్జున్ ‘పుష్ప 2’ కూడా డిశంబర్‌లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ రెండు భారీ చిత్రాల మధ్య ‘తండేల్’ నలిగిపోవడం ఖాయం. అసలే నాగ చైతన్యకి ఓ హిట్టు కావాలి. అది కూడా ‘తండేల్’ రూపంలో వస్తుందన్న ఆశలున్నాయ్.

ఈ సినిమాకి సంబంధించి ఇంతవరకూ వచ్చిన ప్రోమోస్ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేశాయ్. అయితే అనుకోకుండా సినిమాల రిలీజుల్లో వచ్చిన ఈ హఠాత్పరిణామం.. ‘తండేల్’కి దెబ్బ పడుతుందా.? లేదంటే రిలీజ్ డేట్ మార్చుకుంటాడా.? చూడాలిక.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com