‘ఫౌజీ’ కోసం ప్రబాస్‌తో మృణాల్.!
- July 27, 2024
ప్రబాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్టు సిద్ధం చేసే పనిలో హను రాఘవపూడి వున్నాడు.
దాదాపు స్క్రిప్టు వర్క్ పూర్తయినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్‌లో సినిమా సెట్స్ మీదికెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయ్.
ప్రస్తుతం ప్రబాస్ చేతిలో చాలానే ప్రాజెక్టులున్నాయ్. వీటిని పూర్తి చేస్తూనే సమాంతరంగా ‘ఫౌజీ’ కూడా పూర్తి చేయబోతున్నాడనీ సమాచారం. అన్నట్లు ‘ఫౌజీ’ అనే టైటిల్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
కానీ, గాసిప్‌గా లీక్ అయిన ఈ టైటిలే తాను అనుకున్న కథకి యాప్ట్ అనుకుంటున్నాడట హను రాఘవపూడి. త్వరలోనే ఈ టైటిల్‌ని అధికారికంగా ప్రకటించబోతున్నారట.
అలాగే ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించనుందని తెలుస్తోంది. ‘సీతారామం’ సినిమా హను కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సెంటిమెంట్‌గా ప్రబాస్ సినిమాకీ మృణాల్‌నే హీరోయిన్గా తీసుకోవాలనుకుంటున్నాడట. చూడాల మరి.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు