త్వరలోనే మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌తో సమంత.!
- July 27, 2024
‘ది ఫ్యామిలీ మేన్ 2’ వెబ్ సీరస్తో సమంత ఏ రేంజ్లో పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాపులారిటీ ఏ స్థాయిలో వచ్చిందో.. అంతకు మించిన వివాదాలు కూడా చుట్టుముట్టాయ్ ఈ సిరీస్ టైమ్‌లో సమంతని.
అయితేనేం, ఆ సిరీస్ ఓటీటీలో ఓ రేంజ్ ట్రెండింగ్ అయ్యిందనుకోండి. ఆ సంగతి అటుంచితే.. ప్రస్తుతం సమంత సినిమాలకు దూరంగా వున్న సంగతి తెలిసిందే. కానీ, ఓ వెబ్ సిరీస్‌లో నటించిందనీ.. అది త్వరలోనే స్ట్రీమింగ్ కానుందనీ తెలుస్తోంది.
ఆ వెబ్ సిరీస్ పేరు ‘రక్త బ్రహ్మాండ్’. ఆదిత్య రాయ్ కపూర్, వామికా గబ్బి ఈ సినిమాలో ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజ్, డికె రూపొందిస్తున్న ఈ వెబ్ సిరీస్ ఫ్యాంటసీ యాక్షన్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతోంది.
రహీ అనిల్ బర్వే దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్‌ని త్వరలోనే ప్రముఖ ఓటీటీ ఛానెల్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుందని తాజాగా ఓ పోస్టర్ ద్వారా మేకర్లు ప్రకటించారు.
రక్తం అంటిన ఓ కిరీటం ఈ పోస్టర్ ఆసక్తి కలిగిస్తోంది. అన్నట్లు ఈ సిరీస్‌లో పాపులర్ వెబ్ సిరీస్ ‘మీర్జాపూర్’ ఫేమ్ అలీ రైజల్ (గుడ్డు పాత్ర పోషించాడు) కూడా ఓ ఇంపార్టెంట్ రోల్లో నటిస్తున్నాడు. దాంతో మరింత ఆసక్తి నెలకొంది ఈ వెబ్ సిరీస్‌పై. మరి, సమంత హవా కాస్త తగ్గినట్లుగా కనిపిస్తున్న ఈ తరుణంలో ఈ సిరీస్ ఏ రేంజ్ కమ్ బ్యాక్ ఇస్తుందో చూడాలి మరి.
తాజా వార్తలు
- Dh120,000 రుణం చెల్లించాలి..మరో Dh15,000 పరిహారం ఇవ్వాలన్న అబుదాబి కోర్టు
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- ఉపాధ్యాయులందరికి ‘ఉపాధ్యాయ దినోత్సవం’ శుభాకాంక్షలు.. సీఎం చంద్రబాబు
- బహ్రెయిన్‌లో ‘శ్రావణం 2026’ షెడ్యూల్.. ఘనంగా ఓణం వేడుకలు..!!
- మెడికల్ ఎమర్జెన్సీ.. దోహా–బెంగళూరు ఇండిగో విమానం మస్కట్‌కు మళ్లింపు..!!
- రెండో EU–GCC సదస్సుకు సౌదీ అరేబియా ఆతిథ్యం..!!
- ఖతార్ లో పబ్లిక్ ప్రాసిక్యూషన్–స్టేట్ ఆడిట్ బ్యూరో మధ్య కీలక ఒప్పందం..!!
- యూఏఈలో అక్టోబర్ హాఫ్‌టర్మ్ సెలవులు ముందుకు.. పేరెంట్స్ అసంతృప్తి..!!
- కువైట్‌లో డీజిల్ చోరీ.. 41 మంది అరెస్ట్..!!
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్







