త్వరలోనే మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌తో సమంత.!

- July 27, 2024 , by Maagulf
త్వరలోనే మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌తో సమంత.!

‘ది ఫ్యామిలీ మేన్ 2’ వెబ్ సీరస్‌తో సమంత ఏ రేంజ్‌లో పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాపులారిటీ ఏ స్థాయిలో వచ్చిందో.. అంతకు మించిన వివాదాలు కూడా చుట్టుముట్టాయ్ ఈ సిరీస్ టైమ్‌‌లో సమంతని.

అయితేనేం, ఆ సిరీస్  ఓటీటీలో ఓ రేంజ్ ట్రెండింగ్ అయ్యిందనుకోండి. ఆ సంగతి అటుంచితే.. ప్రస్తుతం సమంత సినిమాలకు దూరంగా వున్న సంగతి తెలిసిందే. కానీ, ఓ వెబ్ సిరీస్‌లో నటించిందనీ.. అది త్వరలోనే స్ట్రీమింగ్ కానుందనీ తెలుస్తోంది.

ఆ వెబ్ సిరీస్ పేరు ‘రక్త బ్రహ్మాండ్’. ఆదిత్య రాయ్ కపూర్, వామికా గబ్బి ఈ సినిమాలో ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజ్, డికె రూపొందిస్తున్న ఈ వెబ్ సిరీస్ ఫ్యాంటసీ యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోంది.

రహీ అనిల్ బర్వే దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్‌ని త్వరలోనే ప్రముఖ ఓటీటీ ఛానెల్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుందని తాజాగా ఓ పోస్టర్ ద్వారా మేకర్లు ప్రకటించారు.

రక్తం అంటిన ఓ కిరీటం ఈ పోస్టర్‌ ఆసక్తి కలిగిస్తోంది. అన్నట్లు ఈ సిరీస్‌లో పాపులర్ వెబ్ సిరీస్ ‘మీర్జాపూర్’ ఫేమ్ అలీ రైజల్ (గుడ్డు పాత్ర పోషించాడు) కూడా ఓ ఇంపార్టెంట్ రోల్‌లో నటిస్తున్నాడు. దాంతో మరింత ఆసక్తి నెలకొంది ఈ వెబ్ సిరీస్‌పై. మరి, సమంత హవా కాస్త తగ్గినట్లుగా కనిపిస్తున్న ఈ తరుణంలో  ఈ సిరీస్ ఏ రేంజ్ కమ్ బ్యాక్ ఇస్తుందో చూడాలి మరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com